Saturn-Rahu conjunction: జ్యోతిష్య శాస్త్రంలో శని, రాహువు గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. అంతేకాకుండా శని దేవుడిని కర్మ ప్రదాతగా, న్యాయ దేవుడిగా పరిగణిస్తారు. రాహువు గ్రహాన్ని చెడు గ్రహంగా భావిస్తారు. అయితే ఈ రెండు గ్రహాలు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రెండు గ్రహాలు చాలా రేర్‌గా సంచారం చేస్తూ ఉంటాయి.
ప్రస్తుతం శని తన సొంత రాశి కుంభరాశిలో సంచార దశలో ఉన్నాడు. గత మార్చి 15న శతభిషా నక్షత్రంలోకి ప్రయాణం చేసింది..అయితే అక్టోబర్ 17న ఈ నక్షత్రంలోకి చేరబోతోంది. శతభిషా నక్షత్రానికి అధిపతిగా రాహువు వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ రెండు గ్రహాలు త్వరలోనే కలవబోతున్నాయి. దీని కారణంగా పిశాచ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు జరుగుతాయి.
కర్కాటక రాశి:
శని-రాహువు శతభిషా నక్షత్రంలో కలవడం వల్ల రాబోయే 7 రోజుల పాటు కర్కాటక రాశి వారికి చాలా బాధాకరమైన రోజులు ఏర్పడతాయి. దీంతో పాటు వీరు ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కెరీర్‌లో ఇబ్బందు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు డబ్బు సంబంధిత విషయాలలో, ఉద్యోగ సంబంధిత నిర్ణయాల్లో తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
కన్య రాశి:
శతభిషా నక్షత్రంలో శని, రాహువు గ్రహాలు కలవడం వల్ల కన్యా రాశి వారిపై అశుభ ప్రభావం పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆరోగ్య, ఆర్థిక విషయాల్లో కూడా అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయ. దీంతో పాటు వీరికి అక్టోబర్ 17 వరకు అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇక వీరు ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో గౌరవం, కీర్తి కూడా తగ్గే ఛాన్స్‌లు ఉన్నాయి.
కుంభ రాశి:
కుంభ రాశివారికి కూడా ఈ సమయంలో అనేక సమస్యలు రావచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు వీరికి ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మానసిక సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి అన్ని విషయాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి