Ekadashi 2021, Devshayani Ekadashi 2021: తొలి ఏకాదశి పండగ విశిష్టతలు, పూజా విధానం, దేవశయని ఏకాదశి ఏంటి ?

Ekadashi 2021 puja, Devshayani Ekadashi 2021 puja: తొలి ఏకాదశికి హిందువుల మొదటి పండుగగా పేరుంది. తొలి ఏకాదశి తర్వాతే వరుస క్రమంలో వినాయక చవితి (Ganesh chaturthi), దసరా, దీపావళి ఆ తర్వాత సంక్రాంతి పండుగలు జరుపుకోవడం ఆనవాయితీ. తొలి ఏకాదశినే కొంతమంది పేలాల పండుగ, హరి వాసరం అని అంటుంటారు. ఉత్తరాదిన ఈ పండగను దేవశయని ఏకాదశి (Devshayani Ekadashi 2021) అని పిలుస్తారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 20, 2021, 08:47 AM IST
Ekadashi 2021, Devshayani Ekadashi 2021: తొలి ఏకాదశి పండగ విశిష్టతలు, పూజా విధానం, దేవశయని ఏకాదశి ఏంటి ?

Ekadashi 2021 puja, Devshayani Ekadashi 2021 puja: తొలి ఏకాదశికి హిందువుల మొదటి పండుగగా పేరుంది. తొలి ఏకాదశి తర్వాతే వరుస క్రమంలో వినాయక చవితి (Ganesh chaturthi), దసరా, దీపావళి ఆ తర్వాత సంక్రాంతి పండుగలు జరుపుకోవడం ఆనవాయితీ. అందుకే తొలి ఏకాదశి తిథికి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. తొలి ఏకాదశినే కొంతమంది పేలాల పండుగ, హరి వాసరం అని అంటుంటారు. ఉత్తరాదిన ఈ పండగను దేవశయని ఏకాదశి (Devshayani Ekadashi 2021) అని పిలుస్తారు. 

నేడు అంటే మంగళవారం జులై 20న తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ పండుగ విశిష్టతలు ఏంటి ? తొలి ఏకాదశి పూజా విధానం ఎలా (Ekadashi 2021 puja and significance) ఉంటుంది అనే విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

Also read : Hanuman Puja Vidhanam in Telugu: హనుమాన్ పూజ ఇలా చేస్తే కష్టాలన్ని తొలగి, కోరికలన్నీ నెరవేరుతాయట 

హిందూ క్యాలెండర్ (Hindu calender) ప్రకారం ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. అందులో ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథినే తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. పాల సముద్రంలో శేషతల్పంపై 4 నెలలు నిద్రపోయే శ్రీ మహా విష్ణువు అక్టోబర్ లేదా నవంబర్‌లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు తిరిగి నిద్రలేస్తారని.. అందుకే ఈ నాలుగు నెలల కాలాన్ని చతుర్మాసాలు (Chaturmasa) అంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ నాలుగు నెలల కాలంలోనే కొంతమంది చతుర్మాస దీక్షలు ఆచరిస్తారు. 

ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామ పారాయణం (Lord Vishnu Puja vidhi) చేసి ఉపవాస దీక్ష పాటిస్తే పుణ్యఫలంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. ఏకాదశి మర్నాడు ద్వాదశి సందర్భంగా ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకున్న అనంతరం ఏకాదశి ఉపవాస దీక్ష (Ekadashi fasting) విరమిస్తారు. ఏకాదశి నాడు గోమాతను పూజిస్తే ఎంతో మంచిదని పురాణాలు చెబుతున్నాయి.

Also read : Lakshmi devi's birth: లక్ష్మీ దేవి పుట్టుకకు కారణం ఏంటి ? లక్ష్మీ దేవి ఎక్కడ, ఎలా, ఎప్పుడు పుట్టింది ?

Trending News