Friday Remedies: మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఐశ్వర్యం ఉండాలంటే.. ఈ రోజు ఈ చిన్న పనిచేయండి చాలు!

 Friday Remedies: ఇవాళ అంటే ఆగస్టు 19, 2022, శుక్రవారం చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు భాద్రపద మాసంలో రెండవ శుక్రవారం మరియు జన్మాష్టమి కూడా. లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి ఇదే సరైన రోజు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2022, 01:04 PM IST
Friday Remedies: మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఐశ్వర్యం ఉండాలంటే.. ఈ రోజు ఈ చిన్న పనిచేయండి చాలు!

Friday Remedies for Money: సంపదకు అధిష్ఠాన దేవత లక్ష్మీదేవి. శుక్రవారం రోజున ఈ మాతను పూజిస్తారు. లక్ష్మీదేవిని (LaxmiDevi) ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం చాలా మంచి రోజు. అంతేకాకుండా ఈ శుక్రవారం నాడు జన్మాష్టమి రావడం మరో విశేషం.  ఈ రోజున లక్ష్మీదేవి భక్తిశ్రద్ధలతో  పూజిస్తే మీకు ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. ఈ దేవత అనుగ్రహం పొందాలంటే ఈ కింది చర్యలు చేయండి. 

శుక్రవారం పరిహారాలు
>> శుక్రవారం నాడు ఉదయాన్నే స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించండి. లక్ష్మీదేవి చిత్రపటాన్ని  పూజ మందిరంలో ప్రతిష్టించి ఆ దేవతను పూజించండి. ఈ రోజున శ్రీసూక్తాన్ని పఠించడం శుభప్రదం. లక్ష్మీదేవిని తామరపువ్వుతో ఆరాధించడం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. 
>> శుక్రవారం నల్ల చీమలకు పంచదార తినిపించండి. ఇలా చేయడం వల్ల పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి.
>> శుక్రవారం రోజున ఒక పసుపు గుడ్డలో వెండి నాణెం, 5 పసుపు కొమ్ములు,  కొద్దిగా కుంకుమను కట్టి మీ వద్ద భద్రంగా ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. 
>> భార్యాభర్తల మధ్య టెన్షన్ ఉంటే... శుక్రవారం నాడు మీ పడకగదిలో ప్రేమ జంట చిత్రాన్ని పెట్టడం వల్ల మీ బంధం గట్టిపడుతుంది. 
>> శుక్రవారం లక్ష్మీదేవి ఆలయంలో శంఖం, కౌరీ, కమలం, మఖానా మరియు బటాషాను సమర్పించండి. ఇది చేయడం ఆనందాన్ని మరియు శ్రేయస్సును ఇస్తుంది.
>> సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
>> శుక్రవారం ఆవుకి తాజా రొట్టెలు తినిపించండి. వీలైతే ప్రతిరోజూ ఇలా చేయండి, లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.

Also Read: నేడు శ్రీకృష్ణాష్టమి.. ఈ 4 రాశుల వారికి సిరిసంపదలు వెల్లువెత్తుతాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News