Gajkesari Rajyog 2023: గజకేసరి రాజయోగం వల్ల ఈ రంగాల్లో పని చేసే వ్యక్తులు విపరీతమైన లాభాలు పొందడం ఖాయం!

Gajkesari Rajyog 2023: గ్రహాలు, నక్షత్రరాశుల సంచార ప్రభావం వల్ల పలు రాశులవారి జీవితాల్లో శుభ, అశుభ ప్రభావం ఏర్పడతాయి. అయితే ఇదే క్రమంలో  రాజయోగాలు కూడా వస్తాయి. దీని వల్ల ఏయే రాశులవారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2023, 12:40 PM IST
Gajkesari Rajyog 2023: గజకేసరి రాజయోగం వల్ల ఈ రంగాల్లో పని చేసే వ్యక్తులు విపరీతమైన లాభాలు పొందడం ఖాయం!

Gajkesari Rajyog 2023: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కలయిక చాలా ముఖ్యమైనది. అయితే ఈ నెల 22న ఏర్పడిన గజకేసరి రాజయోగం బృహస్పతి, చంద్రుని కలయిక వల్ల ఏర్పడింది. ఈ యోగం వల్ల చాలా రాశులవారు వివిధ రకాల ప్రయోజనాలు, దుష్ప్రభావాలు పొందుతారు. అంతేకాకుండా గజకేసరి రాజయోగానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. అయితే ఈ యోగం వల్ల మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ యోగం వల్ల ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారిని వరించబోతున్న గజకేసరి రాజయోగం:
ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి గజకేసరి రాజయోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే గజకేసరి రాజయోగం ధనస్సు రాశివారికి రెండవ స్థానంలో బలపడింది. దీంతో సంపద పరంగా విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఊహించని ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కొత్త వ్యాపారాన్ని ఈ క్రమంలో ప్రారంభిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మీడియా, సినిమా, మార్కెటింగ్ రంగాలతో అనుబంధం ఉన్న వారు విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు.

కర్కాటక రాశి:
గజకేసరి రాజయోగం కర్కాటకరాశి వారికి తొమ్మిదో స్థానంలో ఏర్పడింది. కర్కాటక రాశి వారికి ఈ యోగం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి అదృష్టం కూడా లభిస్తుంది. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు.

మీన రాశి:
గజకేసరి రాజయోగం వల్ల మీన రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉండబోతోంది. లగ్న గృహంలో ఈ యోగం ఏర్పడింది. కాబట్టి ఈ రాశివారికి విశేష ప్రయోజనాలు కలిగే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా  కొత్త  ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఈ క్రమంలో మీన రాశివారు ఎలాంటి పనులు చేసిన మంచి ప్రయోజనాలు పొందే ఛాన్స్‌ ఉందని నిపుణులు పేర్కొన్నారు.

Also Read:  Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?

Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News