Gajlakshmi Yoga In Mesh: ఆస్ట్రాలజీలో బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. దేవగురు బృహస్పతి ఏప్రిల్ 21, 2023న 08:43కి మార్గి దశలో మీనం నుండి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి సంచారం కారణంగా అరుదైన గజలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గజలక్ష్మీ రాజయోగం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులేవో తెలుసుకుందాం.
గజలక్ష్మి రాజయోగం ఈ రాశులకు లాభం
మేషరాశి (Aries)
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బృహస్పతి సంచారం మేష రాశి వారి జీవితాల్లో శుభ ఫలితాలను తెస్తుంది. అంతేకాకుండా మీరు వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. మీ ఆదాయంలో రెట్టింపు పెరుగదల ఉంటుంది. సంతానం లేని దంపతులకు పిల్లలు కలిగే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
మిధునరాశి (Gemini)
ఈ సంవత్సరం మిథున రాశి వారికి శని ధైయా ప్రభావం నుండి విముక్తి లభిస్తుంది. గురు సంచారం వల్ల ఈ రాశి వారి జీవితంలో సంతోషం వెల్లివిరిస్తుంది. గజలక్ష్మి యోగం ఈ రాశుల వారి భవితవ్యాన్ని మార్చబోతోంది. అంతేకాకుండా మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. పెట్టుబడి ద్వారా లాభం పొందుతారు. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారి జాతకంలో శని సడే సతి ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. బృహస్పతి సంచారం వల్ల ఏర్పడిన గజలక్ష్మీ రాజయోగం మీకు అనేక లాభాలను ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది.
Also Read: Khappar Yog: 30 ఏళ్ల తర్వాత శనిదేవుడి రాశిలో అరుదైన యోగం.. ఈ 3 రాశులకు జాక్ పాట్ ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. v
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook