Khappar Yog: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా శుభ మరియు అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. శనిదేవుడి సొంత రాశిలో అరుదైన ఖప్పర్ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ప్రభావం వల్ల మూడు రాశులవారు మంచి లాభాలను పొందుతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
ఖప్పర్ యోగం ఈ రాశులకు శుభప్రదం
మేష రాశిచక్రం (Aries)
ఖప్పర్ యోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో పదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీ కష్టానికి భారీ మెుత్తంలో డబ్బు అందుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఫ్యామిలీతో సత్సంబంధాలు మెరుగుపడతాయి.
వృషభ రాశి (Taurus)
ఖప్పర్ యోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో వృషభరాశి వారిని అదృష్టం వరించనుంది. చెడిపోయిన మీ పని కూడా సమయానికి పూర్తవుతుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోరికలు నెరవేరుతాయి. మీ భౌతిక సుఖాలు పెరుగుతాయి. మీడియా, ఫిల్మ్ లైన్, ఫ్యాషన్ డిజైనింగ్ రంగంతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
కర్కాటక రాశిచక్రం (Cancer)
ఖప్పర్ యోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి సప్తమ స్థానంలో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మీకు విజయం లభిస్తుంది.
Also Read: Shani Asta 2023: కుంభరాశిలో అస్తమించబోతున్న శనిదేవుడు.. వీరి కెరీర్ దూసుకుపోవడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook