Grah Gochar 2023: త్వరలో రాహు-కేతు గోచారం.. వీరి జీవితం గందరగోళం.. ఇందులో మీరున్నారా?

Rahu-Ketu Effect 2023: ఆస్ట్రాలజీలో రాహు, కేతువులను ఛాయా గ్రహాలుగా భావిస్తారు.  ఈ రెండు రాశుల రాశి మార్పు ఏరాశుల వారిపై ప్రతికూల ప్రభావం చూపనుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2023, 03:51 PM IST
Grah Gochar 2023: త్వరలో రాహు-కేతు గోచారం.. వీరి జీవితం గందరగోళం.. ఇందులో మీరున్నారా?

Rahu-Ketu Effect 2023: వేద జ్యోతిషశాస్త్రంలో రాహు-కేతులను అశుభ గ్రహాలుగా భావిస్తారు. ఏ వ్యక్తి యొక్క జాతకంలో వీరు బలహీన స్థానంలో ఉంటారో వారు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. దుష్ట గ్రహాలుగా పిలుపబడే రాహు-కేతువులు ఎల్లప్పుడూ వ్యతిరేక దిశలో కదులుతారు. ఈ ఏడాది అక్టోబర్ 30న రెండు గ్రహాలు తమ రాశిని మార్చుకోనున్నాయి. అయితే వీరి సంచారం కొందరి జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

రాహు-కేతు సంచారం ఈ రాశులకు గ్రహచారం
మేషరాశి
అక్టోబర్ 30న రాహు-కేతు రాశిని మారుస్తారు. మేషరాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోంటారు. మీ జీవితంలో ఉద్రిక్తత తలెత్తుంది. మిమ్మల్ని అనేక సమస్యలను చుట్టుముడతాయి. మీ దాంపత్య జీవతంలో విభేదాలు వస్తాయి. 
వృషభం
రాహు-కేతువుల సంచార కాలం వృషభ రాశి వారికి బాధాకరంగా ఉంటుంది. వృషభరాశి వారు అడుగడుగునా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు డబ్బును వృథా చేస్తారు. ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కోవల్సి ఉంటుంది. మిమ్మల్ని అనేక సమస్యలు వెంటాడతాయి. 
కన్య రాశి
రాహు-కేతువుల సంచారం కూడా కన్యారాశి వారికి కష్టాలను పెంచుతుంది. ఇరువురి గ్రహాల ప్రభావం కన్యా రాశివారి జీవితాలపై దుష్ప్రభావం చూపుతుంది. మీకు ప్రతి రంగంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారం మరియు ఉద్యోగంలో అనేక రకాల సమస్యలు మిమ్మల్నిని ఇబ్బంది పెడతాయి. 
మీనరాశి
మీన రాశి వారికి ఈ సమయం చాలా కష్టాలను ఇస్తుంది. మీకు ధన నష్టం వాటిల్లుతుంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో భారీగా నష్టపోతారు. వ్యాపారంలో నష్టాలు వస్తాయి. అప్పు తీర్చడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. 

Also Read: Trigrahi Yog: మీనరాశిలో శక్తివంతమైన 'త్రిగ్రాహి యోగం'.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News