Chaitra Navratri Maha Yog on Ugadi 2023: ఇవాల్టి నుంచి తెలుగు సంవత్సరాది అయిన ఉగాది మెదలుకానుంది. అంతేకాకుండా ఈరోజే నుంచి చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభం కానున్నాయి. చైత్ర మాసంలోని అష్టమ తిథి నాడు ఉగాది పండుగను జరుపుకుంటారు. అంతేకాకుండా ఇదే రోజు కొన్ని ముఖ్యమైన గ్రహాల గొప్ప కలయిక జరగబోతుంది. 700 ఏళ్ల తర్వాత ఈ అద్భుతమైన కాంబినేషన్ ఏర్పడుతుంది. ఈ రోజున నాలుగు రాశులలో ఏడు గ్రహాలు సంచరిస్తాయి. దీని ప్రభావంతో పెను యాదృచ్చికం ఏర్పడుతోంది.
చైత్ర నవరాత్రి 2023 శుభ యోగం
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, దేవగురువు బృహస్పతి మీనరాశిలో కూర్చున్నాడు. మేషరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. సూర్యభగవానుడు మీనరాశిలో, శనిగ్రహం కుంభరాశిలో కూర్చున్నారు. మేషరాశిలో రాహువు, శుక్రుడు కదులుతున్నారు. ఇలా గ్రహాల కలయికతో మాళవ్య, కేదార్, హన్స్, మహాభాగ్య యోగాలు ఏర్పడుతున్నాయి. మేషరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల మాళవ్య యోగం ఏర్పడుతోంది. మీనరాశిలో హన్స్ యోగం, లగ్నంలో సూర్యుడు ఉండటం వల్ల మహాభాగ్య యోగం కలుగుతుంది. ఈ మహాయోగం వల్ల కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది.
ఈ 3 రాశుల వారికి లాభదాయకం
మార్చి 4 నుండి శుక్రుడు మేషరాశిలో కూర్చున్నాడు. వీరి ప్రభావం వల్ల మాలవ్య యోగం ఏర్పడింది. ఈ యోగం యొక్క అత్యంత శుభప్రభావం కన్యారాశి వారిపై ఉంటుంది. మిథున రాశి వారికి మాళవ్య, హన్స్ యోగం లాభదాయకంగా ఉంటుంది. మహాభాగ్య యోగంతో మీన రాశికి బంగారు రోజులు ప్రారంభం కానున్నాయి. ఈ సంచారంలో అన్ని రాశుల అదృష్టం ప్రకాశిస్తుంది. దేవతల అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది.
Also Read: Mercury Transit 2023: మరో వారం రోజుల్లో ఈ 3 రాశులకు అదృష్టం పట్టనుంది.. ఇందులో మీరున్నారా?
Also Read: Nithiin Rashmika : ఒక హిట్ ఇస్తే రెండు మూడు ఫ్లాపులు.. కెరీర్ గురించి కౌంటర్లు వేసుకున్న నితిన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి