Guru Asta 2023: ఈ గ్రహ తిరోగమనంతో మే 2 వరకు మంచి రోజులు లేనట్లే!, శుభకార్యాలు బంద్!

Guru Asta 2023: బృహస్పతి తిరోగమనంతో శుభ ఘడియలు తొలగిపోతాయి. ఈ క్రమంలో ఎలాంటి శుభకార్యాలు చేయరాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఈ కింది చిట్కాలు కూడా పాటించాలి..  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2023, 11:57 AM IST
Guru Asta 2023: ఈ గ్రహ తిరోగమనంతో మే 2 వరకు మంచి రోజులు లేనట్లే!, శుభకార్యాలు బంద్!

Guru Asta 2023: వేద పంచాంగం ప్రకారం..మీన రాశిలోకి బృహస్పతి సంచారం చేయబోతోన్నాడు. అయితే ఇంతక ముందుకు కూడా ఈ గ్రహం మీనా రాశిలోకి సంచారం చేయగా.. అదే రాశిలో తిరోగమనం చెంబోతున్నాడు. ఇదే క్రమంలో సూర్య-గురు కూటమి కూడా ఏర్పడడం వల్ల అన్ని రాశులవారిపై ప్రభావం పడే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా పలు రాశువారికి ఈ క్రమంలో తీవ్ర దుష్ప్రభావాలు కలుగొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటిని జ్యోతిష్య శాస్త్రంలో వీటిని కీడు రోజులుగా భావిస్తారు. కాబట్టి ఈ క్రమంలో శుభకార్యాలు, ధార్మిక కార్యకలపాలు జరుపుకోరు.  

మే 2 వరకు మంచి రోజులు లేనట్లే!
హిందూ మతంలో గురు, శుక్ర గ్రహాలు సంచారం చేయడం వల్ల..వివాహం, యజ్ఞోపవీతం, గృహ ప్రవేశాలు, శుభకార్యాలు జరుపుకోవడం శ్రేయస్కరం కాదని నమ్ముతారు. అంతేకాకుండా ఈ క్రమంలో తప్పకుండా ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 29 నుంచి మే 2 రెండు వరకు ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకపోవడమే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే మే 3వ తేదీ నుంచి మంచి రోజులు మొదలవుతాయని, ఈ రోజు ఎలాంటి శుభకార్యాలు చేసిన మంచి ఫలితాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.

ఈ క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు తప్పని సరి:
మీన రాశిలోకి బృహస్పతి తిరోగమనం కారణంగా..మతపరమైన ఆచారాలు చేయకపోవడం చాలా మంచిది. ఒక వేళ చేస్తే జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన డేట్లలో శుభ కార్యాలు చేసుకోవడం చాలా మంచిది. అయితే ఈ క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా దానధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.  ఈ సమయంలో మాంసం, మద్యానికి దూరంగా ఉండడం చాలా మంచిది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: IPL Updates: ఫుల్ కిక్కే కిక్.. క్రికెట్ పండుగకు వేళయా.. నేడే ఐపీఎల్ ప్రారంభం 

Also Read: Sunrisers Hyderabad: తొలి మ్యాచ్‌కు ముందు మార్పు.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా భువనేశ్వర్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News