Guru Rahu yuti 2022: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. జ్యోతిష్యశాస్త్రంలో దేవగురు బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. గురుడు ఈనెల 22న మేషరాశిలోకి ప్రవేశించాడు. రాహువు ఇప్పటికే అదే రాశిలో సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని అశుభకరమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
మేషం
ఈ రాశిలోనే గురు చండాల యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. మీకు ధన నష్టం ఉంటుంది. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. పనిలో మీకు అడ్డంకులు ఏర్పడతాయి.
మిధునరాశి
మిథున రాశి వారికి గురు, రాహువుల కలయిక ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టవద్దు. ఆదాయం తగ్గుతుంది. మీరు అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కోంటారు. మీ కెరీర్ లో అన్నీ అడ్డంకులే ఉంటాయి.
Also Read: Surya Gochar 2023: వృషభరాశిలోకి సూర్యభగవానుడు.. ఈ 4 రాశులకు పట్టనున్న అదృష్టం..
కర్కాటకం
బృహస్పతి మరియు రాహువు కలయిక కర్కాటక రాశివారి జీవితంలో అనేక సమస్యలను సృష్టించబోతోంది. మీరు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలను కంట్రోల్ లో ఉంచుకోండి, లేకపోతే మీకే నష్టం. మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది.
Also Read: Shani Gochar 2023: శతభిష నక్షత్రంలో శని సంచారం.. రాబోయే ఆరు నెలలు ఈ రాశుల జీవితం కల్లోలం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook