Vipreet Rajyoga effect: ఆస్ట్రాలజీలో గ్రహాల అధిపతిగా బృహస్పతిని భావిస్తారు. గ్రహాల రాశి మార్పు కారణంగా శుభ మరియు అశుభ యోగాలను చేస్తాయి. 12 ఏళ్ల తర్వాత గత నెలలో బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా విపరీత రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్యశాస్త్రంలో ఈ రాజయోగం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం కారణంగా ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
మిధునరాశి
మేషరాశిలో దేవగురువు బృహస్పతి సంచారం మిథున రాశి వారికి మంచి లాభాలను ఇవ్వనుంది. మీ ఆదాయం డబల్ కానుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసిరానుంది. వ్యాపారులు పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
తులారాశి
బృహస్పతి యొక్క ఈ సంచారం తుల రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. వివిధ మార్గాల ద్వారా మీకు ఆదాయం సమకూరుతుంది.
కర్కాటక రాశి
బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారికి మేలు చేస్తుంది. ప్రతి పనిలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీకు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మీకంటూ ఓ గుర్తింపు లభిస్తుంది.
Also Read: Lucky Zodiac: మే నెలలో ఈ రాశులవారే అదృష్టవంతులు.. ఇందులో మీరున్నారా?
కన్య రాశి
బృహస్పతి గోచారం వల్ల కన్యా రాశి వారు ప్రయోజనం పొందుతారు. మీకు ప్రతి పనిలో విజయం దక్కుతుంది. మీ దాంపత్య జీవిత బాగుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.
మీనరాశి
దేవగురువు మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల మీరు చాలా ప్రయోజనం పొందుతారు. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారులు పెద్ద ఆర్డర్లు పొందడం ద్వారా లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగుల జీవితం బాగుంటుంది.
Also Read: Budh uday 2023: మేషరాశిలో ఉదయించబోతున్న బుధుడు.. ఈ 3 రాశులు పట్టిందల్లా బంగారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook