Guru Mahadasha Effect: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాశి మార్పుతోపాటు మహాదశ, అంతర్దశలు కూడా ప్రజల జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతాయి. జాతకంలో ఈ దశలు మంచిగా ఉంటే.. ఆ వ్యక్తి యెుక్క అదృష్టం ప్రకాశిస్తుంది. కుండలిలో గురు గ్రహం శుభస్థానంలో ఉన్న వ్యక్తులు చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు. జాతకంలో బృహస్పతి అశుభ స్థానంలో ఉంటే వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. సాధారణంగా గురు మహాదశ (Guru Mahadasha) ప్రతి వ్యక్తి జీవితంపై 16 సంవత్సరాలు ఉంటుంది. ఇది కొంత మందికి శుభప్రదంగా ఉంటే..మరికొందరికి అశుభకరంగా ఉంటుంది. దీని ప్రభావం మానవ జీవితంపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
గురు మహాదశ శుభ ప్రభావం
ఎవరి జాతకంలో గురు గ్రహం శుభ స్థానంలో ఉంటుందో... ఆ వ్యక్తులు వృత్తిలో పురోగతి సాధిస్తారు. వారికి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. చదువు విషయంలో ముందుంటారు. వీరు చాలా తెలివైనవారిగా, ఉదార హృదయులుగా ఉంటారు. సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారు. గురు మహాదశ ఉన్న వ్యక్తులకు పురోభివృద్ధి, గౌరవం, సంపద, దాంపత్య సుఖం లభిస్తాయి. వీరు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరు చాలా దానదర్మాలు చేస్తారు.
గురు మహాదశ అశుభ ప్రభావం
మరోవైపు, ఎవరి జాతకంలో గురు గ్రహం అశుభ స్థానంలో ఉంటుందో వారు కెరీర్ లో చాలా ఇబ్బందులను ఎదుర్కోంటారు. వారికి దేవుడిపై విశ్వాసం ఉండదు. ఈ వ్యక్తులకు ఉదర సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. బలహీనుడైన గురువు దాంపత్య సుఖాన్ని ఇవ్వడు. వివాహంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఒక వేళ బృహస్పతి మహాదశలో ఉంటే వారు మరిన్ని సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.
బృహస్పతి గ్రహాన్ని బలోపేతం చేయడానికి పరిహారాలు:
>> జాతకంలో గురు గ్రహం బలహీనంగా గురువారం ఉపవాసం ఉండాలి. ఆ రోజు పసుపుతో చేసిన ఏదైనా వస్తువును తినండి.
>>జాతకంలో గురుడు అశుభ స్థానంలో ఉంటే... బృహస్పతితోపాటు విష్ణువును కూడా పూజించండి. ఇది బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది.
>>స్నానపు నీటిలో పసుపు వేసి స్నానం చేస్తే, గురువు యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి మరియు గురువును బలపరుస్తుంది.
>> గురువారం అరటి చెట్టుకు పూజ చేయండి. దానికి పసుపు, బెల్లం మరియు శనగపప్పు సమర్పించండి. ఇలా చేయడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.
>>గురువారం నాడు పేదలకు పప్పు, అరటిపండ్లు మరియు పసుపు మిఠాయిలను దానం చేయండి. ఇది సంపద, దాంపత్య సంతోషం, విజయాన్ని ఇస్తుంది.
Also Read: Budh Gochar 2022: ధనస్సు రాశిలోకి తిరోగమన బుధుడు... ఈరాశులకు కష్టాలే కష్టాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook