Surya Gochar 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఒక గ్రహం రాశిచక్రాన్ని మార్చినప్పుడల్లా, దాని ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుంది. ఇటీవల సూర్యుడు తులారాశిలోకి (Sun transit in Libra 2022)ప్రవేశించాడు. సూర్యుడు విశ్వాసం, విజయం, తండ్రి, గురువు మరియు శక్తికి కారకుడు. తులరాశికి అధిపతి శుక్రుడు. శుక్రుని రాశిలో సూర్యుని ప్రవేశం కొన్ని రాశులకు చాలా ప్రయోజనాలను ఇస్తుంది. వీరు వ్యాపార, ఉద్యోగాల్లో చాలా విజయాలను అందుకుంటారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
సూర్యుడి సంచారం ఈ రాశులకు ప్రయోజనం
మిధునరాశి (Gemini): సూర్యుని సంచారం మిథున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈరాశివారు సంతానం పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. మిథునరాశికి అధిపతి బుధుడు. మెర్క్యూరీ, సూర్యుడు స్నేహితులు. దీంతో సూర్య సంచారం ఈ రాశివారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
వృషభం (Taurus): వృషభ రాశి వారికి కూడా సూర్య సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరాశివారు ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఫ్యామిలీలోని సంతోషం ఉంటుంది.
కన్య (Virgo): ఈ రాశి వారు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. కన్యారాశిని పాలించే గ్రహం బుధుడు. బుధుడు మరియు సూర్యుని మధ్య స్నేహ భావం ఉంది. సూర్యుని సంచారం ఈ రాశి వారికి వ్యాపారంలో చాలా లాభాన్ని ఇస్తుంది. ప్రతి పనిలో విజయం ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వ్యాపారంలో ఏదైనా పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది.
Also Read: Lunar Eclipse 2022: సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు? ఇది మనదేశంలో కనిపిస్తుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి