Guru Margi 2022: మీనరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం... 12 రాశులపై పెను ప్రభావం..

Guru Margi 2022: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, బృహస్పతి మీన రాశిలో సంచరిస్తున్నాడు. 12 రాశులపై దీని ప్రభావం ఉంటుందో తెలుసుకోండి.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2022, 03:33 PM IST
Guru Margi 2022: మీనరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం... 12 రాశులపై పెను ప్రభావం..

Jupiter Margi In November 2022: జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తుంటాయి. ఒక్కోసారి ప్రత్యక్షంగా సంచిరిస్తే... మరికొన్ని సార్లు తిరోగమనంలో ఉంటాయి. దీని ప్రభావం ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. మూడు రోజుల కిందట అంటే నవంబరు 24న దేవగురు బృహస్పతి మీనరాశిలో ప్రత్యక్ష సంచారంలోకి (Guru Margi in meena 2022) వచ్చాడు. దీని ఎఫెక్ట్ మెుత్తం 12 రాశులవారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోండి. 

మేషం (Aries): మీ సంచార జాతకంలో బృహస్పతి 12వ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీంతో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. 
వృషభం (Taurus): మీ జాతకంలో గురు గ్రహం మార్గి 11వ ఇంట్లో సంచరిస్తోంది. ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. అలాగే, షేర్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో మంచి లాభం ఉంటుంది.
మిథునం (Gemini): బృహస్పతి మీ పదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందవచ్చు. అంతేకాకుండా కొత్త జాబ్ ను కూడా పొందే అవకాశం ఉంది. 
కర్కాటకం (Cancer): గురు గ్రహం మీ తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తోంది. దీంతో మీ అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 
సింహం (Leo): బృహస్పతి మీ జాతకంలో ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీంతో ఈ సమయం మీకు బాగానే కలిసి వస్తుంది. అనారోగ్యం నుండి ఉపశమనం పొందుతారు. 
కన్య (Virgo): మీ రాశి నుండి బృహస్పతి ఏడవ ఇంటిలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 

తుల రాశి (Libra): బృహస్పతి సంచారం మీ జాతకంలో ఆరవ ఇంట్లో ఉంది. దీంతో మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీరు పాత వ్యాధుల నుండి విముక్తి పొందుతారు. 
వృశ్చికం (Scorpio): బృహస్పతి మీ రాశి నుండి ఐదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ సమయం విద్యార్థులకు బాగుంటుంది. పోటీ పరీక్షల్లో అభ్యర్థులు విజయం సాధిస్తారు. 
ధనుస్సు (Sagittarius): బృహస్పతి మీ జాతకంలోని నాల్గవ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీంతో మీరు సకల భౌతిక సుఖాలను పొందగలరు. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
మకరం (Capricorn): బృహస్పతి మీ రాశి నుండి మూడవ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీంతో మీ ధైర్యం పెరుగుతంది. అంతేకాకుండా అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. 
కుంభం (Aquarius): బృహస్పతి మీ రెండవ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీంతో మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ప్రస్తుతం మీరు కొత్త రుణాలు ఇవ్వడం మానుకోవాలి.
మీనం (Pisees): గురుడు ఈ రాశిలోనే సంచరించనున్నాడు. దీంతో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. 

Also Read: Astrology: అనురాధ నక్షత్రంలో మూడు గ్రహాలు... ఈ రాశులకు ఆర్థికంగా లాభం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News