Lord Hanuman: మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనులు చేయకండి, మీరు భారీగా నష్టపోతారు!

Lord Hanuman: హిందువులు మంగళవారం హనుమంతుడిని ఆరాధిస్తారు. మంగళవారం కొన్ని పనులు చేయడం నిషిద్ధం. ఇవి చేస్తే ఆంజనేయుడికి కోపం వస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 2, 2022, 10:41 AM IST
Lord Hanuman: మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనులు చేయకండి, మీరు భారీగా నష్టపోతారు!

Tuesday puja tips: హిందువులు మంగళవారం ఆంజనేయస్వామిని (Lord Hanuman) పూజిస్తారు. పురాణాల ప్రకారం, హనుమంతుడిని శివుడి 11వ అవతారంగా భావిస్తారు. మీ జాతకంలో శని, కుజుడు, రాహువు మరియు కేతువు వంటి అపవిత్ర గ్రహాలు ఉన్నట్లయితే.. మీరు మంగళవారం హనుమంతుడిని పూజిస్తే మంచిది. ఈ రోజున మారుతిని ఆరాధించడం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. సాధారణంగా పెద్ద వారు మంగళవారం ఎలాంటి పనులు మెుదలుపెట్టకూడదంటారు. దానికి కారణం ఏంటి, మంగళవారం ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం. 

మంగళవారం ఈ పనులు చేయకండి
>> మంగళవారం నాడు పొరపాటున కూడా నల్లని దుస్తులు వేసుకోకండి. ఈ రోజున ఎరుపు లేదా నారింజ రంగు బట్టలు ధరించడం వల్ల మంగళ దోష ప్రభావం తగ్గుతుంది.
>> ఈ రోజున మహిళలు ఎలాంటి మేకప్ కిట్ కొనకూడదు. అలా చేయడం వల్ల వారి వైవాహిక బంధంలో ఇబ్బందులు రావచ్చు.
>> ఈ రోజు జుట్టు కత్తిరించడం, షేవ్ చేయడం, గోళ్లు కత్తిరించుకోవడం అశుభం. మంగళవారం ఈ పనులన్నీ చేయడం వల్ల జీవితంలో డబ్బు, తెలివితేటలు పోగొట్టుకుంటారని చెబుతారు. 

>> మంగళవారం నాడు ఉప్పు తినకూడదు, అది ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.
>> ఈ రోజున పడమర మరియు ఉత్తరం వైపు ప్రయాణించడం మానుకోండి. పక్కా వెళ్లాలనుకుంటే బెల్లం తిన్న తర్వాత ఇంటి నుండి బయలుదేరండి.
>> మంగళవారం నాడు నాన్ వెజ్ తినకండి. మద్యం జోలికి వెళ్లకండి. 
>> ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి. దీని వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. 
>> ఈ రోజున మీ సోదరుడు లేదా స్నేహితునితో ఎప్పుడూ వివాదం పెట్టుకోవద్దు, ఎందుకంటే దీని కారణంగా మీరు మీ జీవితాంతం పశ్చాత్తాపపడవలసి ఉంటుంది.

Also Read: Naga Panchami 2022: 30 ఏళ్ల తర్వాత నాగ పంచమి రోజు అరుదైన యాదృచ్ఛికం! 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News