Happy Pongal 2023: సంక్రాంతిని 14 తేది జరుపుకోవాలా..లేదా 15 తేది జరుపుకోవాలా అని కంగారు పడుతున్నారా?

Happy Pongal 2023: సంక్రాంతి పండగ ప్రతి సంవత్సరంలో వచ్చే మొదటి పండగ. అందుకే హిందువులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ రోజూ ఎలాంటి పనులు చేయడం వల్ల మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2023, 10:30 AM IST
Happy Pongal 2023: సంక్రాంతిని 14 తేది జరుపుకోవాలా..లేదా 15 తేది జరుపుకోవాలా అని కంగారు పడుతున్నారా?

Happy Pongal 2023: హిందూ సాంప్రదాయంలో సంక్రాంతికి చాలా ప్రముఖ్యత ఉంది. అయితే ఈ మకర సంక్రాంతిని జరుపుకోవడానికి ప్రధాన కారణాలు సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారికి మంచి జరుగుతుందని.. దీని కారణంగా మకర సంక్రాంతి వైభవంగా జరుపుకుంటారని పూర్వీకులు పేర్కొన్నారు. అంతేకాకుండా రైతులు ఈ క్రమంలో కొత్తగా పండించిన పంటలకు పూజా కార్యక్రమాలు కూడా చేస్తారు. భారతీయులంతా ఈ రోజు పిండి వంటలను తయారు చేసుకుని ఎంతో ఆనందంతో కుటుంబంతో తింటారు. అంతేకాకుండా మరికొందరైతే వస్తువులను కూడా దానం చేస్తారు.  వస్తువులను దానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

మకర సంక్రాంతి అసలు తేదీ ఎపుడో తెలుసా?:
మకర సంక్రాంతి పండుగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. అందుకే దీనిని వివిధ పేర్లతో కూడా పిలుస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. మకర సంక్రాంతిని తూర్పు ఉత్తరప్రదేశ్‌లో ఖిచ్డి, గుజరాత్, రాజస్థాన్‌లలో ఉత్తరాయణం.. హర్యానాలో మాఘి, పంజాబ్, తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు. మకర సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం జనవరి నెలలో మాత్రమే వస్తుంది. అయితే ఈ సంవత్సరం సూర్య సంచారంలో మార్పులు రావడంతో పండుగ తేదీ విషయంలో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఇంతకీ అసలు తేది వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మకర సంక్రాంతి జనవరి 14వ తేదా.. లేదా 15 తేదినా?
ప్రతి సంవత్సరం లోహ్రీ తర్వాత.. ఒక రోజు మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు.ఈ సంవత్సరం పండుగను 15 జనవరి 2023 ఆదివారం రోజు జరుపుకోవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శుభ ముహూర్తం జనవరి 14న 08.57 నిమిషాలకు ప్రారంభమవుతుంది.

మకర సంక్రాంతి శుభ సమయం:
మకర సంక్రాంతి పుణ్యకాలం జనవరి 15 ఉదయం 07:15 నుంచి సాయంత్రం 05:46 వరకు ఉంటుంది. వ్యవధి 10 గంటల 31 నిమిషాలు. మకర సంక్రాంతి మహా పుణ్యకాల సమయం జనవరి 15 ఉదయం 07:15 నుంచి 09:00 వరకు ఉంటుంది. వ్యవధి 01 గంట 45 నిమిషాలు.

Also Read: Ind Vs SL: సిరీస్‌ విజయంపై భారత్ కన్ను.. ఆ ప్లేయర్‌ను ఆపితేనే..!  

Also Read: India vs Sri Lanka: విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మధ్య విభేదాలు.. నెట్టింట వీడియో వైరల్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News