Horoscope March 6 2022: నేటి రాశిఫలాలు...ఆ రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటే మంచిది!

Horoscope March 6 2022: ఈ రోజు రాశిఫలాలు గమనించినట్లయితే...కొన్ని రాశులవారికి మాత్రమే అనుకూల ఫలితాలు ఉన్నాయి. మరికొన్ని రాశులకు మిశ్రమకాలం నడుస్తోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2022, 06:40 AM IST
  • ఈ రోజు రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే
  • కొన్ని రాశుల వారికి పూర్తిగా అనుకూల సమయం
  • కొన్ని రాశుల వారికి మిశ్రమ కాలం నడుస్తోంది
Horoscope March 6 2022: నేటి రాశిఫలాలు...ఆ రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటే మంచిది!

Horoscope Today March 6 2022: సాధారణంగా మనం ఏ పని మెుదలుపెట్టాలన్నా, శుభకార్యం చేయాలన్నా ఆ రోజు దినఫలాలు ఎలా ఉన్నాయో చూస్తాం. మరి నేటి రాశిఫలాలు (Horoscope Today)  ఏ రాశులవారికి అనుకూలంగా ఉందో, ఏ రాశుల వారికి మిశ్రమ కాలం నడుస్తుందో ఓ లుక్కేద్దాం.

మేషం (Aries) :  ఈ రోజు ఈ రాశివారు స్థిరనిర్ణయాలతో చేసే పనులు ఫలిస్తాయి. ఒక శుభవార్త వీరి మనోధైర్యాన్ని పెంచుతుంది, 

వృషభం (Taurus) : ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి. గోసేవ చేయడం మంచిది. 

మిథునం (Gemini) : వీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులను కలుస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.  ఒక వార్త వీరికి ఆనందాన్నిస్తుంది ధనాగమనసిద్ధి ఉంది. సొంతింటి విషయంలోముందడుగు పడుతుంది. 

కర్కాటకం (Cancer):  ఈ రాశివారు అధిక శ్రమ లేకుండా చూసుకోవాలి. మనోబలంతో చేసే పనులు సిద్దిస్తాయి. ఆపదలు రాకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. 

సింహం (Leo) : ఈ రోజు ఈ రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి. వీరి ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య (Virgo):  వీరు కీలక వ్యవహారాల్లో నీరసించకుండా ముందుకు సాగితే అనుకున్న పనులు పూర్తవుతాయి. అందరినీ కలుపుకొనిపోవడం మంచిది. కొన్ని విషయాలు మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. సమయానికి నిద్రాహారాలు పాటించాలి.

తుల (Libra): ఈ రాశివారు బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు పనిచేసే రంగంలో ఊహించిన ఫలితాలు చూస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 

వృశ్చికం (Scorpio) : ఈ రోజు ఈ రాశివారు సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాలు జోలికి పోకుండా ఉంటే మంచిది.

ధనుస్సు ((Sagittarius): వీరు కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా ఫర్వాలేదు. కీలక వ్యవహారాల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 

మకరం (Capricorn) : సమయానుకూలంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. వీరి అధికార పరిధి పెరుగుతుంది. 

కుంభం (Aquarius) :  పట్టుదలతో పనిచేస్తే మంచి ఫలితాలను వస్తాయి. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. ఒక వార్త వీరి మనోధైర్యాన్నిపెంచుతుంది. 

మీనం (Pisces) :  ఈ రోజు ఈ రాశివారికి వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలున్నాయి. చిత్తశుద్ధితో చేసే పనులు విశేష లాభాన్ని చేకూరిస్తాయి. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల అంగీకారం తీసుకుంటే మంచిది. 

Also Read: Venus Transit 2022: శుక్రుని అనుగ్రహం.. మరికొద్దిరోజుల్లో ఈ 3 రాశుల వారు ధనవంతులవుతారట...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News