Horoscope Today: నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఈ రాశివారు కోపాన్ని తగ్గించుకోకపోతే భారీగా నష్టపోతారు..

Horoscope Today: ఈరోజు చాలా రాశులవారికి శుభసమయం నడుస్తోంది. ముఖ్యంగా వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మీనం వారు మంచి ఫలితాలను సాధిస్తారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2022, 06:25 AM IST
Horoscope Today: నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఈ రాశివారు కోపాన్ని తగ్గించుకోకపోతే భారీగా నష్టపోతారు..

Horoscope Today: మనలో చాలా మంది ఏ పని అయినా మెుదలుపెట్టేటప్పుడు, ఎక్కడికైనా వెళ్లేటప్పుడు, శుభకార్యం చేయాలనుకున్నప్పుడు ఆరోజు దినఫలాలు ఎలా ఉన్నాయో చూస్తారు. మరి నవంబరు 11న రాశిఫలాలు (Horoscope on 11th November 2022) ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.  

మేషం (Aries): ఈరోజు మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. చురుకుగా ఉండేందుకు ప్రయత్నించండి. మెుత్తానికి ఈ సమయం మీకు మిశ్రమంగా ఉంటుంది. 
వృషభం (Taurus): మీరు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం  కూడా ఉంది. 
మిథునం (Gemini): మీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. పెద్దలు లేదా మీ పై అధికారుల నుంచి ప్రోత్సాహకాలను అందుకునే అవకాశం ఉంది. సహచరుల సపోర్టు లభిస్తుంది. 
కర్కాటకం (Cancer): ఈరోజు మీరు నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు మానసికంగా దృడంగా ఉంటారు. అంతేకాకుండా మీరు చేసే ప్రతిపనిలోనూ విజయం సాధిస్తారు. ఫ్యామిలీ సపోర్టు మీకు లభిస్తుంది. 
సింహం (Leo): ఇది మీకు శుభ సమయం. ఈరోజు మీరు చేసే పనులకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో మీరు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. 
కన్య (Virgo): మీరు విజయం కోసం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మిత్రుల సపోర్టుతో మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 

తుల (Libra): ఈ సమయం మీకు అంతగా అనుకూలించకపోవచ్చు. మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన మీకు బాధ కలిగించే అవకాశం  ఉంది. కుటుంబంలో సమస్యలు ఉంటాయి. కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. 
వృశ్చికం (Scorpio): ఈరోజు మీరు మంచి రిజల్ట్స్ సాధిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. మీరు అందరి దృష్టిని ఎట్రాక్ట్ చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి.
ధనస్సు (Sagittarius): మీ తెలివితేటలతో కొన్ని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను అందుకుంటారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
మకరం (Capricorn): మీరు చేపట్టే ఏ కార్యక్రమంలోని చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి సంయమనం పాటించి ముందుకు వెళ్లండి. మెుత్తానికి ఈ సమయం మీకు కఠినంగా ఉంటుంది. 
కుంభం (Aquarius): ఫ్యామిలీ సపోర్టుతో మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. డబ్బు ఆదా చేయండి. కొన్ని విషయాల్లో ఓర్పుగా ఉండండి. 
మీనం (Pisces): ఈ సమయంలో మీరు కొత్త వస్తువులు కొంటారు. మీరు మెుదలుపెట్టే పనుల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. మీ అధికార పరిధి విస్తరిస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Also Read: Surya Gochar 2022: వృశ్చికరాశిలోకి సూర్యభగవానుడు... నవంబర్ 16 నుండి ఈ రాశులకు మంచి రోజులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News