Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 11, 2021 Rasi Phalalu, వారికి శుభకార్యాలకు ఆహ్వానాలు

Today Horoscope In Telugu 11 March 2021 : మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 11న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు. ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2021, 07:56 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 11, 2021 Rasi Phalalu, వారికి శుభకార్యాలకు ఆహ్వానాలు

Horoscope Today 11 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 11న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
మీరు చాలా కష్టపడి పనిచేస్తున్న వారైతే విశ్రాంతి తీసుకోవడానికి నేడు తగిన తరుణం. పని నుంచి విశ్రాంతి తీసుకుని మీరు కోరుకున్నది చేయండి. మీకు అర్హత ఉందని తెలిసిన విషయాలతో కొత్త నెలను ప్రారంభించండి. ఇది మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. మీ పనులలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలు, వ్యాపారాలలో సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

Also Read: Maha Shivratri 2021 Date And Time: మహా శివరాత్రి తేదీ, పూజకు శుభ ముహూర్తం, తిథి, ప్రాముఖ్యత

వృషభ రాశి
మీరు కొంతకాలం మాట్లాడటానికి సంకోచిస్తున్న వ్యక్తులను నేడు కలుసుకుని వారితో సమయం గడుపుతారు. ఇది మీకు మేలు చేస్తుంది. ఈ రోజు నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగులు, వ్యాపారులకు తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనుకోని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించి మాట్లాడాలి. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది.

మిథున రాశి
మీరు ఏదైనా విషయం గురించి ఆలోచిస్తే, దానిపై పూర్తి నమ్మకం కొనసాగించండి. మీ ఆలోచన తీరు, మంచితనం మీకు మేలు చేయనుంది. ఎదురుచూస్తున్న శుభవార్తను మీరు స్వీకరించవచ్చు. బంధువులు, సన్నిహితులతో అనుకోకుండా విభేదాలు తలెత్తుతాయి. ఆలయాలు సందర్శించాలని నిర్ణయం తీసుకుంటారు. 

కర్కాటక రాశి
మీ సున్నితమైన వ్యక్తిత్వం మీలో ఉత్తమమైనది. అయితే ఈ రోజు మీరు చాలా ధైర్యంగా ఉంటారు. మీ సున్నితత్వాన్ని పక్కన పెట్టి, మీలోని బలమైన విషయాలను అన్వేషించండి. కొంతకాలంగా మీరు చెప్పదలచుకున్నది చెప్పండి. మీరు సాధారణంగా చేయని పనిని చేయండి. చేపట్టిన పనులలో విజయం వరిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు అభివృద్ధి సూచనలు గోచరిస్తున్నాయి.

సింహ రాశి
మీలోని సింహం లాంటి గుణాలు నేడు నిజం కానున్నాయి. ఈ రోజు మీరు సాధారణ రోజులకన్నా ధైర్యంగా వ్యవహరిస్తారు. ఇది మీకు చాలా మేలు చేయనుంది. మీరు చేయాలనుకున్నది ఏదైనా ఉంటే, ధైర్యంగా ఉండండి మరియు ముందుకు సాగండి.  ముఖ్యంగా వ్యాపారులకు లాభాలు సమకూరనున్నాయి. దైవదర్వనం చేయాలని భావిస్తారు. కొన్ని పనులలో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుకుంటారు.

Also Read: Maha Shivaratri 2021: మహా శివరాత్రి రోజున ఇలాచేస్తే పరమశివుడ్ని ప్రసన్నం చేసుకోవచ్చు

కన్య రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితులను అదుపులో ఉంచండి. మీకు అవసరం లేని వాటి కోసం ఖర్చు చేయవద్దు. లేనిపోని వస్తువులు, సేవలకు అధికంగా ఖర్చు చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడతాయి. తద్వారా రుణాల కోసం ఇతరులను ఆశ్రయించాల్సి వస్తుంది. దైవదర్శనం చేస్తారు. కొన్ని పనులలో జాప్యం తలెత్తి పనులు నత్తనడకన సాగుతాయి.

తులా రాశి
ఈ రోజు మీ సమస్యల గురించి మరిచిపోండి. మీరు చేసే పనికి గుర్తింపు, గౌరవం దక్కుతాయి. ఈ రోజు మీ జీవితంలో అనుకూలతను తెస్తుంది. తద్వారా కొత్త కోణంతో విషయాలను చూడటానికి మీకు సహాయపడుతుంది. ఆకస్మిక ప్రయాణాలతో అధిక ఖర్చులు మీకు భారం కానున్నాయి. ఉద్యోగులకు గుర్తింపు, వ్యాపారాలకు లాభసాటిగా ఉంటుంది. 

వృశ్చిక రాశి
మీరు సమస్యను పరిష్కరించగలరు. కానీ మీరు ప్రపంచ భారాన్ని మీ భుజాలపై మోస్తున్నట్లుగా భావించి ఆందోళన చెందుతారు. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయడం ఉత్తమం. నేడు మీరు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలతో మీకు కలిసొస్తుంది. పెట్టుబడి పెట్టే వారికి ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు రాశి
మీ సాహసోపేత నిర్ణయాలు పక్కన పెట్టి, ఈ రోజు పనిపై దృష్టి పెట్టవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే నక్షత్రాలు మీకు అనుకూలంగా పని చేస్తున్నందున మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి ఇది చాలా మంచి రోజు. మీరు ఎదురుచూస్తున్న ఆ ప్రమోషన్ లేదా మీరు కొంతకాలంగా తీసుకోవాలనుకుంటున్న రిస్క్ ఫలించే సమయం వచ్చేసింది. అయితే ఆర్థిక సమస్యలతో చికాకు పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకోవాలని భావిస్తారు.

Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది

మకర రాశి
ఈ రోజు మీ ఆధిపత్యాన్ని పక్కన పెట్టి, మీ చుట్టూ ఉన్నవారికి సహాయంగా ఉండవలసిన రోజు. మీ తెలివితేటలు మరియు అంతర్ దృష్టి మీ కార్యాలయంలో లేదా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు కూడా అవసరం కావచ్చు. మీ అభిప్రాయాన్ని వారితో పంచుకుంటే అంతా శుభమే. నేడు మీకు వస్తులాభం. చాలా కాలం తరువాత చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మీ నిర్ణయాలతో, మంచితనంతో సంఘంలో గౌరవం లభిస్తుంది.

కుంభ రాశి
మీకు ఎంతగానో కావాలసిన వ్యక్తి గురించి మీ భావాలను ఎక్కువగా దాచుకున్నారా? ప్రియమైన వ్యక్తితో మీ మనసులో మాటను చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. అదే సమయంలో మీకు సహాయం చేయడానికి మరియు మార్గదర్శకత్వం వహించడానికి సరైన వ్యక్తిని గుర్తిస్తారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. ఉద్యోగులకు ఒత్తిడి, పని భారం పెరుగుతుంది. శ్రమకు తగ్గ ఫలితం గోచరించడం లేదు. కుటుంబసభ్యులతో ప్రేమగా వ్యవహరించాలి.

మీన రాశి
మీరు చాలా ఇస్తున్నారు, కానీ మీకు విలువ ఇవ్వని వ్యక్తుల కోసం మీ సమయాన్ని మరియు శక్తిని వృథా చేయకండి. మీకు నిజమైన సన్నిహితులు, శ్రేయోభిలాషులను గుర్తించడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీ కోసం కొంత సమయం కేటాయించడం మర్చిపోవద్దు. ఉద్యోగులకు పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News