Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 12, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Today Horoscope In Telugu 12 April 2021 | గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 12వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2021, 08:03 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 12, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Horoscope Today 12 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 12వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఈ రోజు మీరు సానుకూల దృక్పథంతో వ్యవహరించనున్నారు. ఇది మీరు ఎదుర్కొంటున్న ఏదైనా కెరీర్, ఉద్యోగ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఈ రోజు మీ కుటుంబం మీ అభిప్రాయాలను వినకపోవచ్చు. మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగులు, వ్యాపారులకు నిరుత్సాహంగా ఉండనుంది. శ్రమకు తగ్గ ఫలితం చేతికి అందదు.

Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

వృషభ రాశి
ఈ రోజు చంద్రుడి ప్రభావంతో సృజనాత్మకతను ప్రదర్శించనున్నారు. మీరు పనిచేసే చోట మీ ఉన్నతాధికారులకు కొత్త ఆలోచనలు వచ్చేలా చేస్తారు. నేడు మీ ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారులకు నేడు శుభ సమయం. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయనున్నారు.

మిథున రాశి
ఈరోజు ప్రారంభంలో అంతా మీకు ప్రతికూలంగా కనిపిస్తుంది. కానీ మీ కెరీర్‌ను ఈ రోజు ఎంచుకుంటారు. లేదా ఇప్పటివరకూ ఎంచుకున్న కెరీర్‌లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మీ ఆర్థిక పరిస్థితులను సమీక్షించుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆహ్వానాలు అందడంతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటక రాశి 
నేడు మీకు ఎదురుకాబోయే ఏవైనా వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడానికి మీరు మానసికంగా సిద్దంగా ఉంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శించాలని భావిస్తారు. ప్రేమ కోసం పరితపిస్తారు. అయితే నేడు ఒంటరిగా ఉండటం మరియు ప్రేమకు దూరంగా ఉండటం మీకు మేలు చేస్తుంది. కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉండనుంది.

సింహ రాశి
ఈ రోజు మీరు కొంత సమయం ఆనందంగా గడుపుతారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదగా ఉంటుంది. విద్యార్థులు ఈ రోజు మీ అధ్యయనాలలో అదనపు దృష్టి పెట్టాలని భావిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కొన్ని పరిస్థితుల కారణంగా ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. 

Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ

కన్య రాశి
సృజనాత్మకమైన కోసం కొంత డబ్బు ఖర్చు చేయడానికి ఇది మంచి రోజు. మీరు హస్తకళలకు సంబంధించిన వారైతే ఆ వృత్తి గురించి ఆలోచించండి. ఈ రోజు మీ అంతిమ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లోనూ సహనాన్ని కోల్పోవద్దు. నూతన ఉద్యోగావకాశాలకు ఆహ్వానాలు అందుతాయి.

తులా రాశి
మీకు నిన్నటి నుండి తగినంత నిద్ర లేదని అనిపిస్తుంది. మీరు ఎక్కడ స్థిరపడాలనుకుంటున్నారు మరియు ఎవరితో ఉండాలనుకుంటున్నారు వంటి మీ దీర్ఘకాలిక వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టిసారించండి. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. కొన్ని విషయాలు సంతోషాన్నిస్తాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది.

వృశ్చిక రాశి
మీరు ఈ రోజు సృజనాత్మకత దిశగా అడుగులు వేయనున్నారు. మీరు ఆఫీసులో కొంతకాలం నుంచి వాయిదా వేస్తున్న పనులు ప్రయత్నించడానికి నేడు తగిన సమయం. కొత్తగా పెళ్లయిన వారు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కొన్ని విషయాలలో విభేదాలు తలెత్తుతాయి.

ధనుస్సు రాశి
ఈ రోజు మీ కెరీర్ గురించి పునరాలోచిస్తారు. కెరీర్ మారాలనుకుంటే నేడు చాలా మంచి రోజు. విద్యార్థులు తమ మేధస్సుకు పదను పెట్టేందుకు కొత్త కోర్సు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ప్రేమ లాంటి విషయాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులకు నిరాశాజనకంగా ఉండనుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి.

Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా

మకర రాశి
మీ వ్యక్తిగత జీవితంలో జరిగిన తప్పిదం నేడు పరిష్కారం అవుతుంది. పనిలో కేవలం మీరు మాత్రమే చేయకుండా జట్టు సభ్యులతో పనులు చేయించాలి. ఇంట్లో కొంచెం ఒంటరిగా అనుభూతి చెందుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. కీలక సమాచారం మీకు సంతోషాన్నిస్తుంది.

కుంభ రాశి
ఈ రోజు కుంభ రాశి వారికి సోమరితనంగా ఉండనుంది. మీ మనస్సు ప్రశాంతంగా ఉండటానికి ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్య బాధిస్తుంది. వ్యాపారులకు ఆటంకాలు తలెత్తుతాయి.

మీన రాశి
మీరు సంతోషంగా ఉండే పరిస్థితులు నేడు కనిపిస్తాయి. ఈ రోజు పని చాలా డిమాండ్ కానుంది. ఇంట్లో పిల్లలు మీ ప్రేమను కోరుకుంటారు. మీ అదృష్టం త్వరలో మారబోతోంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగం మారేందుకు ప్రయత్నాలు మొదలుపెడతారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News