Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మే 14, 2021 Rasi Phalalu, ఓ రాశివారు శుభవార్త అందుకుంటారు

Today Horoscope In Telugu : రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 14వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 14, 2021, 08:07 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మే 14, 2021 Rasi Phalalu, ఓ రాశివారు శుభవార్త అందుకుంటారు

Horoscope Today 14 May 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 14వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
చేపట్టిన పనులకు ఆటంకాలు తలెత్తుతాయి. మీరు ఈ రోజు ఇంటి, ఆఫీసు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అయితే మిగతా వారు మీ అభిప్రాయాలతో ఏకీభవించరు. మరియు తుది నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయాన్ని కేటాయిస్తారు. మీ నాయకత్వ నైపుణ్యాలతో సరైన నిర్ణయం తీసుకుంటున్నానని భావిస్తారు. వీలైనంత దౌత్యపరంగా ఉండటానికి ప్రయత్నించండి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడి భారం కానుంది.

Also Read: Kumbhmela: కుంభమేళా ప్రభావం..ఒకే కుటుంబంలో 33 మందికి కరోనా పాజిటివ్

వృషభ రాశి
ప్రతిభ ఉన్నప్పటికీ మీరు దానిపై ఎప్పుడూ ఫోకస్ చేయలేదు. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావంతో మీ నైపుణ్యాన్ని వెలికి తీయాల్సిన అవసరం వస్తుంది. మిమ్మల్ని చూసి ఇతరులు ఆశ్చర్యపోతారు. కొందరు వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు సానుకూల ఫలితాలు రానున్నాయి. కష్టపడి పనిచేస్తే విజయం సాధ్యపడుతుంది.

మిథున రాశి
ఈ రోజు మీరు ఏదైనా చేసే ముందు మీ కుటుంబాన్ని సంప్రదించాలి. వారితో చర్చించి, వారి అభిప్రాయానికి సైతం విలువ ఇవ్వాల్సి ఉంటుంది. సన్నిహితులు లేదా స్నేహితులలో ఒకరు సహాయం కోరి మీ ఇంటికి చేరుకుంటారు. ఈ రోజు ఆఫీసు సంబంధిత పనులలో వెనకడుకు వేయవద్దు. మీ కుటుంబానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని తెలసుకుంటారు. ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

కర్కాటక రాశి 
ఆస్తికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఏదైనా భూమి, ఆస్తి కొనుగోలు చేయడానికి నేడు చాలా మంచిరోజు. ఈ ఆస్తి భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. చాలా రోజుల తరువాత కొందరు మిత్రులను కలుసుకుంటారు.

సింహ రాశి
నేడు సింహ రాశి వారు ఉల్లాసంగా, ఉత్సాహంగా సమయాన్ని గడుపుతారు. మీరు ఇష్టపడే వారితో కొన్ని కీలక విషయాలలపై చర్చించి వారి అభిప్రాయాన్ని తెలుసుకుంటారు. మీరు చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉందని భావిస్తారు. నేడు మీకు వస్తు లాభం గోచరిస్తుంది. ఉద్యోగావకాశాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుతుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది.

Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos

కన్య రాశి
నూతన వ్యక్తులను కలవడానికి సిద్దంగా ఉంటారు. విషయాలు తెలుసుకునేందుకు నో చెప్పకండి. కుటుంబసభ్యులు, సన్నిహితులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. ప్రయాణాలు చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు, వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. 

తులా రాశి
తులా రాశి వారు తమ తప్పులను సరిదిద్దడానికి ఇది తగిన సమయం. మీరు ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి వస్తే, ఈ రోజు చెప్పడం మంచిది. తద్వారా మీ గౌరవం సైతం పెరుగుతుంది. చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ఉత్తమం. ఉద్యోగులు అధికంగా శ్రమించక తప్పదు .

వృశ్చిక రాశి
ప్రజలు ఎల్లప్పుడూ మీతో ఉండటానికి ఇష్టపడతారు, మరియు మీ ఇల్లు ప్రతి ఒక్కరికి కావలసిన ప్రదేశంగా మారనుంది. ఈ రోజు మీరు మంచి హోస్ట్ అవుతారు. బంధువులను ఇంటికి ఆహ్వానించి మరియు వారికి రుచికరమైన భోజనం ఏర్పాటు చేస్తారు. ఆర్థిక సమస్యలు తీరనున్నాయి. కొందరు మిత్రులు మిమ్మల్ని కలుసుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. 

ధనుస్సు రాశి
ఈ రోజు మీరు ఎక్కడికి ప్రయాణాలు చేయవద్దు. మీరు కొంచెం గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. మీరు ఏదైనా విషయాన్ని అంగీకరించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని మరవొద్దు. వ్యాపారాలలో అభివృద్ధి సాధించనున్నారు. ఉద్యోగులకు తగిన గౌరవం, గుర్తింపు లభిస్తాయి.

Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

మకర రాశి
చాలా కాలం నుంచి కోరుకున్న కొన్ని విషయాల కోసం సమయాన్ని కేటాయిస్తారు. అయితే తప్పుడు మార్గంలో మాత్రం మీ పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. ఉద్యోగులకు పని మరింత భారం కానుంది. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. ఆర్థిక సమస్యలు బాధిస్తాయి.

కుంభ రాశి
ఈ రోజు మీరు ఏది చెప్పినా అందరూ గుర్తుంచుకుంటారు. మీ అభిప్రాయాలను చెప్పడానికి బదులుగా ఇతరులు మీకు ఏం చెబుతున్నారో వినడానికి ప్రయత్నించండి. కొన్ని విషయాలు మీకు వ్యతిరేకంగా జరుగుతాయి. ఇతరులను మీ మాటలతో బాధపెట్టవచ్చు. ప్రయాణాలు చేయడంతో ఆరోగ్య సమస్య బారిన పడతారు. ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు.

మీన రాశి
ఈ రోజు రహస్యాలను అలాగే దాచి ఉంచాలి. ఇతరులకు చెప్పాల్సిన  విషయాలు ఉంటే, ఆ ఆలోచనను విరమించుకోండి. మీ లక్ష్యాలు మరియు కెరీర్ ప్లాన్ గురించి ఇతరులతో మాట్లాడవద్దు. చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని గౌరవిస్తారు. ఉద్యోగులు నూతనోత్సాహంతో పనిచేస్తారు. శుభకార్యాలలో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలు చేయాలా వద్దా అని ఆలోచిస్తారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News