Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 19, 2021 Rasi Phalalu, ఆ రాశులవారికి ధనలాభం

Today Horoscope In Telugu 19 April 2021 | ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2021, 08:02 AM IST
  • Today Horoscope In Telugu 19 April 2021 |
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 19, 2021 Rasi Phalalu, ఆ రాశులవారికి ధనలాభం

Horoscope Today 19 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 19వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
మీ జీవిత భాగస్వామికి సంబంధించి మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. మీ కార్యాలయంలో తరచుగా చేసే వాదనలు మానుకోండి. మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే, కొంతకాలం వేచి చూడటం శ్రేయస్కరం. ఇంట్లో వ్యక్తుల మధ్య సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టిసారిస్తారు. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. విద్యార్థులకు ఆశించిన మేర ఫలితాలు రానున్నాయి.

Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

వృషభ రాశి
మీ సృజనాత్మకతను పెంచుకోవడానికి ఇది తగిన సమయం. మీ కెరీర్ ఎంచుకోవడానికి ఆలోచన మొదలవుతుంది. ఇంట్లో కొన్ని వస్తువులు మార్చాలని, కొన్ని నూతన వస్తువులు తీసుకురావాలని భావిస్తారు. స్థిర ఆస్తులలో పెట్టుబడులు పెట్టాలని ఇతరులకు సలహా ఇస్తారు. కొంత బంగారం కొనడానికి ప్రయత్నిస్తారు.

మిథున రాశి
కొన్ని విషయాలు మీకు సమస్యగా మారతాయి. అయితే తేలికగా వాటి నుంచి బయటపడతారు. తల్లిదండ్రులు త్వరలోనే నగరం నుండి బయలుదేరబోతున్నందున ఈ రోజు మీరు కొంత సమయం వారికి కేటాయించాలి. నూతన పరిచయాలతో కొత్త విషయాలు తెలుసుకుంటారు. నేడు మీకు ధన, వస్తు లాభాలు గోచరిస్తున్నాయి.  

కర్కాటక రాశి 
నేడు మీకు పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ రోజు చాలా సంతోషకరంగా గడవనుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ప్రేమ అంటూ కాలయాపన చేయరాదని, కెరీర్, పనిపై  దృష్టి పెట్టాలని కొందరు సలహా ఇస్తారు. విద్యార్థులు కొత్త కోర్సులు తీసుకోవటానికి మొగ్గు చూపుతారు. దైవ దర్శనాలు చేస్తారు. కొన్ని పనులు మధ్యలోనే నిలిచిపోతాయి.

Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

సింహ రాశి
మీ సహనం ఈరోజు నశించే సూచనలు కనిపిస్తున్నాయి. పనిలో తలెత్తనున్న సమస్యలతో మీ ఉత్పాదకతకు ఆటంకం కలుగుతుంది. ఇంటి నుండి వచ్చే కాల్‌లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మరియు మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

కన్య రాశి
ఈ రోజు కన్య రాశి వారు ఆధ్యాత్మికం అనుభూతి చెందుతారు. మీ చుట్టూ ఉన్న కొందరికి సహాయం చేస్తారు. నేడు మీ పనులు సజావుగా సాగుతాయి. మీరు ఓ శుభవార్త అందుకునే అవకాశం ఉంది. తల్లిదండ్రులు మీ నిర్ణయాలకు అనుగుణంగా ఉంటారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి.

తులా రాశి
ఈ రోజు వ్యక్తిగత జీవితం విషయంలో భయాలు తలెత్తుతాయి. మీరు చాలా సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మానసిక ప్రశాంతత కోసం ఈ రోజు ధ్యానం చేయాలి. పెద్దల ఆశీర్వాదంతో అంతా శుభాలే కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది.

వృశ్చిక రాశి
మీరు పనిలో తీరిక లేకుండా గడుపుతారు. మీరు పనిచేసే చోట ఇతరులకు అవకాశాలను ఇప్పించాలని యత్నిస్తారు. గతంలో మీరు చేసిన పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. ప్రేమలో ఉన్న వారికి కష్టాలు తప్పవు. చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ప్రయాణాల కారణంగా ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగులు కాస్త నిరాశకు లోనవుతారు.

Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ

ధనుస్సు రాశి
ఈరోజు ధనుస్సు రాశి వారికి నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. పనిలో నాయకత్వ బాధ్యలతో తీరిక లేకుండా గడుపుతారు. మీ లక్ష్యాల వైపు దృష్టిసారిస్తారు. స్నేహితులు, కుటుంబసభ్యులకు సమయాన్ని కేటాయిస్తారు. ఉద్యోగుల శ్రమకు తగ్గ ఫలితం రానుంది. 

మకర రాశి
మీ ఇల్లు లేదా ఆఫీసును పునరుద్ధరించడానికి మీ సృజనాత్మకతను ఉపయోగిస్తారు. అధ్యయనం చేస్తున్న విద్యార్థులు విరామం తీసుకోవడానికి ఇది మంచి రోజు. నూతన పరిచయాలతో కొత్త విషయాలు తెలుసుకుంటారు. శుభకార్యాలు, విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులకు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి.

కుంభ రాశి
మీరు కోరుకున్న విధంగా చుట్టుపక్కల వారు మీకు సహకరించకపోవచ్చు. కనుక ఎవరితో ఎంతవరకు ఉండాలో అర్థమవుతుంది. వ్యాపారులకు పెట్టుబడులకు ఇది మంచి సమయం కాదు. మీ లక్ష్యాలు ఏమిటో తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అర్థం చేసుకోకపోవచ్చు. నూతన నిర్మాణాలు చేపట్టాలని భావిస్తారు. ఆర్థిక సమస్యల వల్ల రుణ యత్నాలు మొదలుపెడతారు.

మీన రాశి
ఈ రోజు మీన రాశి వారు పనిపై దృష్టి పెడతారు. ఉత్సాహంగా తమ పనులను పూర్తి చేయనున్నారు. ఉన్నతాధికారులు మీకు ప్రోత్సాహాన్ని అందించే అవకాశం ఉంది. కొన్ని కుటుంబ సమస్యల కారణంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ రోజు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. రుణయత్నాలు చేస్తారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News