Today Horoscope: నేటి రాశి ఫలాలు మార్చి 2, 2021 Rasi Phalalu, ఆ రాశుల వారికి ధనలాభం

Horoscope Today 2 March 2021: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 2న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2021, 07:58 AM IST
Today Horoscope: నేటి రాశి ఫలాలు మార్చి 2, 2021 Rasi Phalalu, ఆ రాశుల వారికి ధనలాభం

Horoscope Today 2 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 2న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
కుటుంబసభ్యులు మిమ్మల్ని నియంత్రించేందుకు యత్నిస్తారు. అయితే ఇది మీకు నచ్చదు. మీరు ఎల్లప్పుడూ నాయకత్వం వహించాలని కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు ఇతరులకు కూడా అవకాశం ఇవ్వడం మంచిది. కుటుంబం మరియు స్నేహితుల ఇచ్చే సలహాలు విని వారిని ప్రశంసిస్తారు. ఇతరులను బాధపెట్టే పనులు చేయకుండా ఉండాలని భావిస్తారు. కొత్త పనులు ప్రారంభించినా జాప్యం ఏర్పడుతుంది. 

Also Read: Maha Shivaratri 2021: మహా శివరాత్రి రోజున ఇలాచేస్తే పరమశివుడ్ని ప్రసన్నం చేసుకోవచ్చు

వృషభ రాశి
మీరు ఈ రోజు ఇష్టమైనవారితో ఎక్కువ సమయం గడపనున్నారు. గతం గురించి మాట్లాడటం ద్వారా మరియు పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం ద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు. ఉద్యోగాలో సమస్యలను అధిగమిస్తారు. ధైర్యంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్న వారికి ఫోన్ చేసి మాట్లాడటం లేదా నేరుగా కలుసుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుంది.

మిథున రాశి
మీకు అవసరమైనప్పుడు ఓ వ్యక్తి మీ కోసం ఉన్నారని గుర్తుంచుకోండి. నేడు వారి సాయం కోరేందుకు సిద్ధపడతారు. మొండి పట్టుదలను వీడాలి. ఇతరులు చెప్పింది శ్రద్ధగా విని స్పందించడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శించాలని నిర్ణయించుకుంటారు. ఇతరులకు మీరు స్ఫూర్తిగా నిలుస్తారు. స్థిరాస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయనున్నారు.

కర్కాటక రాశి
మార్పు కోసం కర్కాటక రాశి వారికి ఇది చాలా మంచి సమయం. కానీ అదే సమయంలో మీ ఆరోగ్యంపై జాగ్రత్త వహించకపోతే అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. షాపింగ్ చేయాలని మీ మనసు కోరుకుంటుంది. ఆర్థిక సమస్యలు ఉన్న కారణంగా కొత్త పనులు చేపట్టకుండా ఉండటమే శ్రేయస్కరం. నూతన విషయాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.

Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది

సింహ రాశి
మీ స్నేహితులు మీ నుండి దూరం అవుతున్నారని అనిపిస్తుంది. కొంతకాలం కిందట మీకు దూరమైన బంధువులు, మిత్రులను మళ్లీ కలుసుకునేందుకు  ఒక అవకాశం తీసుకోండి. మీరు కష్టాల్లో ఉన్న సమయాల్లో మీ కోసం ఉన్నవారికి క్షమాపణ సైతం చెప్పాలి. నేడు మీరు పనిపై ఎక్కువ దృష్టిసారిస్తారు. రుణాలు తీసుకుంటారు. మీకు కనిపించని శత్రువు నుంచి ప్రమాదం పొంచి ఉందని గ్రహిస్తారు. 

కన్య రాశి
ఇటీవలి కొన్ని పరిస్థితుల కారణంగా, మీరు చాలా విశ్వాసాన్ని కోల్పోయారని భావిస్తారు. ఈ అనుమానాలు జీవితంలో ఆటంకాలకు కారణం అవుతాయి. కనుక ధైర్యంగా అడుగులు ముందుకేస్తే విజయం తథ్యం. అదే సమయంలో మీ చుట్టూ ఉన్న మంచి విషయాలపై దృష్టి పెట్టండి. మిమ్మల్ని ఇతరులు విశ్వసిస్తారు. దైవదర్శనాలు చేయాలని నిర్ణయం తీసుకుంటారు. కుటుంబంలో విభేదాలు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి.

తులా రాశి
మీరు కొంతకాలం కలుసుకోని బంధువులను ఓ ఫ్యామిలీ ఫంక్షన్ మిమ్మల్ని దగ్గర చేస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. అయినా చింతించకుండా వ్యవహరిస్తారు. తెలిసిన వ్యక్తులతో సమయం గడిపేందుకు ప్రయత్నాలు మొదలుపెడతారు. ఆకస్మిక ధనలాభం చేకూరనుంది. కుటుంబసభ్యులు సంతోషంగా ఉంటారు. నేడు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. 

Also Read: Srisailam Brahmotsavalu: మహా శివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీశైలం క్షేత్రం 

వృశ్చిక రాశి
ఈ రోజు మీరు కొన్ని విషయాలలో భావోద్వేగానికి లోనవుతారు. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని విషయాలు బయటపడకపోవచ్చు, కానీ దాన్ని ఎక్కువగా ఆలోచించవద్దు. మనసు ప్రశాంతంగా ఉండేందుకు యోగా చేయండి. మీకు బాధ కలిగించే వివిధ విషయాలతో మరియు వ్యక్తులను మీరు పొరపాటున కలుస్తారు. ఖర్చులు అధికం అవుతాయి. బంధువులు, సన్నిహితుల సహకారంతో నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలకు అంతా మేలు జరుగుతుంది.

ధనుస్సు రాశి
ఈ రోజు ఇతరులు మిమ్మల్ని అంతగా అర్థం చేసుకోలేరు. దీనివల్ల అపార్థాలు మరియు అధికార దుర్వినియోగం ఏర్పడవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. నేడు ధనస్సు రాశి వారికి ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. సమాజంలో మీ పేరు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రుణ బాధలు తీరనున్నాయి. కుటుంబం, స్నేహితులతోగానీ సంతోషంగా గడుపుతారు.

మకర రాశి
మీరు ఈ రోజు కొన్ని విషయాలలో మధ్యవర్తిత్వం వహించబోతున్నారు. సన్నిహితుల మధ్య సమస్యను పరిష్కరించనున్నారు. అయితే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని సందర్భాలలో ఇవి విరోధానికి దారితీయనున్నాయి. ఒత్తిడి, ఆందోళన అధికం అవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

కుంభ రాశి
మీ వ్యక్తిగత సమస్యల నుండి పారిపోవాలని భావిస్తారు. కానీ అది ఎన్నటికీ మీకు పరిష్కారం చూపించదు. మీరు ఆధారపడిన వ్యక్తులతో కూర్చుని సమస్యను వారికి వివరించండి. వారు మీకు సహాయం చేసే అవకాశం ఉంది. ఆఖరి నిమిషంలో సన్నిహితుల సహకారం లభిస్తుంది. అయినా నిరాశ చెందకుండా కార్యజయం సిద్ధిస్తుంది. ప్రయాణాల కారణంగా ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. అనారోగ్యం బారిన పడతారు.

మీన రాశి
ఈ రోజు మీ చుట్టూ ఉన్నవారికి మీన రాశి వారు దగ్గర అవుతారు. ఇతరులు ఏ సమస్యలను ఎదుర్కొంటున్నా, వారికి సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీ సాయం పొందిన వ్యక్తులపై, మీ అభిప్రాయాలను బలవంతంగా రుద్దవద్దు. అయితే మీ నిర్ణయాన్ని తెలపవచ్చు. నేడు మీన రాశి వారికి ధనలాభం. ఉద్యోగులు, వ్యాపారులకు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకోకుండా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News