Horoscope prediction today: నేడు శనివారం (డిసెంబర్ 11). ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ముందుగా పంచాంగం
శ్రీ ప్లవనామ సంవత్సరం
2021 డిసెంబర్, 11 (శనివారం)
సూర్యోదయం ఉదయం 6:24 గంటలకు
సూర్యాస్తమయం సాయంత్రం 5:23 గంటలకు
తిథి- శుక్లపక్షం అష్టమి రాత్రి 12:07 గంటల వరకు తదుపరి నవమి
రాహుకాలం: ఉదయం 09:00 గంటల నుంచి 7:51 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం 6:24 గంటల నుంచి 07:51 గంటల వరకు
రాశి ఫలాలు..
మేష రాశి (Aries)
శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు పాటించాలి. ముందు చూపుతో వ్యవహరించాలి. పనులు సమయానికి పూర్తవుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులకు కలిసి వస్తుంది.
వృషభ రాశి (Taurus)
ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. వృత్తి, వ్యపారాల్లో ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. బంధు, మిత్రుల సహకారం అందుతుంది. ఓ శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.
మిథున రాశి (Gemini)
మీరు ఎంతగానో వేచి ఉన్న ఓ సమస్య తీరుతుంది. పనులు సమయానికి పూర్తవుతాయి అయితే ఇందుకు శ్రమ అధికమవుతుంది. వ్యాపారులకు సానుకూలంగా ఉంది. ఉద్యోగ జీవితం కూడా సాఫీగా సాగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కర్కాటక రాశి (Cancer)
నిరుత్సహా పరిచే సంఘటనలు జరగొచ్చు. అందుకే ఉద్యోగులు, వ్యాపారులు ఆచి తూచి వ్వవహరించాలి. ఒత్తిడి పెరగొచ్చు. వీలైనంత ప్రశంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. అవసరానికి మిత్రుల సహకారం లభిస్తుంది.
సింహ రాశి (Leo)
పనికి తగ్గ ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులు శ్రమకు గుర్తింపు పొందుతారు. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీ పై స్థాయి వారితో మంచిగా నడుచుకోవడం వల్ల ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా దృఢపడుతారు.
కన్యా రాశి (Virgo)
నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశాలున్నాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. బంధువులతో విభేదాలకు తావివ్వకండి. ఉద్యోగులు తమ పనితీరుతో పై స్థాయి అధికారుల మెప్పు పొందుతారు.
తులా రాశి (Libra)
ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ఒత్తిడి పెరగొచ్చు. ఓ వార్త మీ ప్రశాంతతను పాడు చేస్తుంది. ఆర్థికంగా పరవాలేదు అనిపిస్తుంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నా సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి (Scorpio)
మీ ప్రశాంతతతోనే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. పెళ్లికి సంబంధించిన పనుల్లో పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు మంచి కాలకం నడుస్తోంది. ప్రయాణాల పట్ల జాగ్రత్త అవసరం.
ధనుస్సు రాశి (Sagittarius)
ఓ శుభవార్త వింటారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాపారులు, ఉద్యోగులకు అనుకూల అవకాశాలు ఉన్నాయి. అయితే శ్రమ కాస్త పెరగొచ్చు. సమస్యలను దాటుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు.
మకర రాశి (Capricorn)
అన్ని విధాలుగా ఇది మీకు శుభ దినం. ఉద్యోగం, వ్యాపారం పరంగా సానుకూలంగా ఉంది. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడొచ్చు. అనవసర ఖర్చులు ఇబ్బందులకు దారి తీయొచ్చు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. రోజంతా ఆహ్లాదంగా గడిచే అవకాశముంది.
కుంభ రాశి (Aquarius)
ఇబ్బంది పెట్టే సంఘటనలు జరగొచ్చు. శారీరక, మానసిక శ్రమ పెరగకుండా జాగ్రత్త పడాలి. ఆటంకాలను అధిగమించి ముందుకు సాగాలి. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది.. అయితే ఖర్చులు అదే స్థాయిలో పెరగొచ్చు.
మీన రాశి (Pices)
పనుల్లో ఆటుపోట్లు ఎదురైనా.. పట్టుదలతో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. ఏదైనా భారీ లావాదేవీ జరిపే ముందు ఆచి తూచి వ్యవహరించాలి. ఆదాయం పెరగొచ్చు. ఏదైనా పని ప్రారంభించే ముందు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయమిది.
Also read: December 10 Horoscope: తిథి- మార్గశిర శుద్ధ సప్తమి.. కొత్త పరిచయాలతో ఆర్ధిక లాభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook