Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 22, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Today Horoscope In Telugu 22 April 2021: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 22వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు. రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2021, 08:05 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 22, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Today Horoscope In Telugu 22 April 2021: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 22, 2021 Rasi Phalalu
Horoscope Today 22 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 22వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు కొన్ని సమయాల్లో వేగంగా స్పందించడానికి ఇష్టపడతారు. కాని ఈ రోజు అది మీకు శ్రేయస్కరం కాదు. ప్రతి కదలికను జాగ్రత్తగా మరియు వ్యూహాత్మకంగా ప్లాన్ చేయాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి.

Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

వృషభ రాశి
వృషభ రాశి వారు ఈ రోజు సరదాగా మరియు ఉల్లాసంగా ఉండాలని భావిస్తారు. మీరు గతానికి భిన్నంగా బయటకు వెళ్లి ఇతరులను కలుసుకుంటారు. మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడి, ఇతరులతో కలివిడిగా మెలుగుతూ ఆనందంగా ఉంటారు. అధికంగా శ్రమించినా ఫలితాలు అంతంత మాత్రమే. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నారు.

మిథున రాశి
ఈ రోజు మీకు పనులపై ఆసక్తి కలగకపోవచ్చు. నేడు మీరు చాలా భావోద్వేగాలకు లోనవుతారు. కొన్ని విషయాలు మీకు చిరాకు తెప్పిస్తాయి. అయినా ఇతరులపై ఆవేశ పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. విశ్రాంతి తీసుకోవాలని భావిస్తారు. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు.

కర్కాటక రాశి 
మీరు తీరికలేని పని కారణంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఏదో ఒక స్థలాన్ని తీసుకోవాలని సహచరులతో చర్చిస్తారు. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. నగదు అవసరం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. కొన్ని విషయాలలో విభేదాలు తలెత్తుతాయి.

సింహ రాశి
మీరు గత కొన్ని రోజులుగా ఒత్తిడికి గురవుతున్నారు, కాని ఈ రోజు ఆ ఒత్తిడికి పరిష్కారం దొరుకుతుంది. నేడు కొన్ని విషయాలు మీకు మానసిక ప్రశాంతతను అందిస్తాయి. మీ చుట్టుపక్కల ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగులకు పనిలో కలిసొస్తుంది.

Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

కన్య రాశి
మీరు చాలా ఆదర్శవాదులుగా మారతారు. మీ చుట్టూ ఉన్న కొన్ని శక్తులు మీకు సానుకూల ఫలితాలు ఇస్తాయి. విద్యార్తులు తమ కెరీర్ గురించి ఆలోచిస్తారు. ఉద్యోగులకు పని భారం కానుంది. వ్యాపారులు శ్రమకు తగ్గ లాభాలు పొందుతారు. అనవసర ఖర్చులు చేయకూడుదు. నగదు కోసం రుణాలు చేయాల్సి ఉంటుంది.

తులా రాశి
మీకు ఇష్టమైన వారితో కలిసి ఉండటానికి ప్రయత్నిస్తారు. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న నగదు చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు తీరడంతో ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వ్యాపారులకు ఆశించిన మేర ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

వృశ్చిక రాశి
ఈ రోజు మీ ప్రతికూల ఆలోచన మీ మార్గాన్ని మార్చే అవకాశం ఏర్పడుతుంది. అనూహ్యంగా మీరు ఆశించనిది మీ మార్గంలో ఎదురవుతుంది. చాలా కాలం తరువాత కొందరు మిత్రులను కలుసుకోనున్నారు. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు రావడంతో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతారు. అయితే ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.

Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ

ధనుస్సు రాశి
ఈ రోజు మీరు మీ జీవితంతో సంతృప్తి చెందిన అనుభూతి పొందుతారు. మీ చుట్టూ జరుగుతున్న అన్ని మార్పులను మీరు అంగీకరించాల్సి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాల కారణంగా ఖర్చులు అధికం అవుతాయి. తద్వారా రుణ యత్నాలు మొదలుపెడతారు. ఉద్యోగులు ఏం చేయాలో అర్థంగాక గందరగోళానికి గురవుతారు.

మకర రాశి
మీరు గత కొన్ని రోజుల నుంచి తీరిక లేకుండా గడుపుతున్నారు. కనుక ఈరోజు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తారు. కొన్ని నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీ సమస్యలకు పరిష్కారం కనుగొనటానికి యత్నిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం శ్రేయస్కరం.
 
కుంభ రాశి
ఈ రోజు మీరు చాలా సానుకూల ధోరణిలో వ్యవహరిస్తారు. ఎక్కడైతే చెడు జరుగుతుందని అందరూ చెబుతారో, అందులో మంచి అవకాశాలను చూస్తారు. ఇది మీ చుట్టుపక్కల వారిని ప్రేరేపించేలా చేస్తుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగిపోయి మందడుగు వేయనున్నారు. వ్యాపారాలలో నూతన మార్పులకు శ్రీకారం చుడతారు.

మీన రాశి
ఈ రోజు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గడపడానికి మీకు కాస్త సమయం దొరుకుతుంది. కనుక వారికి కొంత సమయం కేటాయించి, దగ్గరగా ఉన్నవారిపై శ్రద్ధ వహించాలి. కొన్ని కీలక నిర్ణయాలుు తీసుకుంటారు. వ్యాపారులకు అంతా లాభసాటిగా ఉండనుంది. పనిచేసే చోట జరిగే వ్యవహారాలను జాగ్రత్తగా గమనించాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News