Today Horoscope In Telugu 31 May 2021: నేటి రాశి ఫలాలు మే 31, 2021, ఓ రాశివారికి వస్తులాభం

Horoscope Today 31 May 2021: ఈ రోజు ఇతరుల గొడవలో వేలు పెట్టి సమస్యలలో చిక్కుకుంటారు. ఇతరుల వ్యాపారానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఉద్యోగులు కెరీర్‌లో మరో అడుగు ముందుకు వేయనున్నారు. నేడు చేయవలసిన పనుల నుండి మీ దృష్టిని మళ్ళించవద్దు. అనారోగ్య సమస్య బాధిస్తుంది. అనుకోని వివాదాలు. వ్యాపారులకు అంతంతమాత్రంగా ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 31, 2021, 07:55 AM IST
Today Horoscope In Telugu 31 May 2021: నేటి రాశి ఫలాలు మే 31, 2021, ఓ రాశివారికి వస్తులాభం

Horoscope Today 31 May 2021: ప్రతి ఒక్క రాశికి ఓ ప్రత్యేక లక్షణం ఉంటుంది. శ్రీ ప్లవ నామ సంవత్సరం మే 31వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఈరోజు మీలో చాలా మార్పులు రానున్నాయి. ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. అందుకోసం మీరు శారీరకంగా, మానసికంగా సిద్ధమవ్వాలి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు సాధారణంగా ఉంటుంది. వ్యాపారులకు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి.

వృషభ రాశి
ఈ రోజు ఇతరుల గొడవలో వేలు పెట్టి సమస్యలలో చిక్కుకుంటారు. ఇతరుల వ్యాపారానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఉద్యోగులు కెరీర్‌లో మరో అడుగు ముందుకు వేయనున్నారు. నేడు చేయవలసిన పనుల నుండి మీ దృష్టిని మళ్ళించవద్దు. అనారోగ్య సమస్య బాధిస్తుంది. అనుకోని వివాదాలు. వ్యాపారులకు అంతంతమాత్రంగా ఉంటుంది.

Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

మిథున రాశి
గతంలో చేసిన పనులను మరోసారి చేయాలని నిర్ణయించుకుంటారు. కానీ అందుకు తగిన సమయం మరియు వనరుల కొరత కారణంగా పునరాలోచన చేయాల్సి ఉంటుంది. పాత పనులను పూర్తి చేయనున్నారు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది. ఖర్చులు అధికం కానున్నాయి. 

కర్కాటక రాశి 
మీ లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం దొరుకుతుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా మీ దారికి వచ్చే అన్ని సమస్యలను పరిష్కరించుకోవడం. మీ మాటల్ని ఇతరులు అర్థం చేసుకోని కారణంగా వివాదాలు తలెత్తుతాయి. మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ధ్యానం చేయాలి. వ్యాపారులకు సమస్యలు తొలగుతాయి.

సింహ రాశి
నేడు మీరు గందరగోళ స్థితిలో ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేయనున్నారు పని చేసే శక్తి ఉన్నప్పటికీ, పనులను చేయకుండా మిమ్మల్ని ఆపే ఏదో ఉన్నట్లు భావిస్తారు. ఒత్తిడిని జయిస్తే మీదే విజయం. నేడు మీకు వస్తులాభం గోచరిస్తుంది. శుభకార్యాలలో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగులకు పనిలో ఏ సమస్య ఉండదు. 

కన్య రాశి
తమను తిరస్కరించడాన్ని ఎవరూ ఇష్టపడరు. కానీ మీ సానుకూల వైఖరి కారణంగా ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు. మీ జీవింతో ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఖర్చులను అదుపులో ఉంచుకుంటే సగం సమస్యలు తొలగుతాయి. అనారోగ్య సమస్య బాధిస్తుంది. కుటుంబంలో కొన్ని విషయాలలో విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారులు పెట్టుబడులు కోసం ఎదురుచూస్తారు.

Also Read: Fertility Myths: సంతానలేమిపై మగవారిలో 5 ముఖ్యమైన సందేహాలు, వాటి సమాధానాలు

తులా రాశి
కమ్యూనికేషన్ ఈ రోజు కీలకంగా మారనుంది. మీ మాటలు ఇతరులు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కావాలనే విషయాలు దాచి పెడుతున్నారని మాట పట్టింపులు. ఖర్చులు అధికం కావడంతో రుణ యత్నాలు మొదలుపెడతారు. వ్యాపారులకు సమస్యలు. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. 

వృశ్చిక రాశి
నేడు మీరు కొన్ని మార్పులు కోరుకుంటారు. అందుకు సంబంధించిన పనులతో తీరిక లేకుండా గడుపుతారు. మీ కోసం తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని మర్చిపోకండి. కొన్ని రిస్క్‌లు తీసుకోండి. మీకు సంతోషం కలిగే వరకు కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. పనులు సకాలంలో పూర్తవుతాయి స్నేహితులు మిమ్మల్ని కలుసుకుంటారు.

ధనుస్సు రాశి
ఈరోజు మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తారు. కానీ మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఒకే చోట కూర్చోవడం కంటే వ్యాయామం లేదా ఏదైనా శారీరక శ్రమ చేయాలి. ఖర్చులు అధికం కావడంతో రుణ యత్నాలు చేస్తారు. వ్యాపారులకు అంతగా కలిసిరాదు. 

మకర రాశి
కొత్త వ్యక్తులు పరిచయంతో పరిస్థితిలో మార్పులొస్తాయి. మీ పనిలో ముండుగు వేస్తారు. యత్నకార్యసిద్ది. ఇతరుల విషయాలలో కొన్నిసార్లు మీరు మధ్యలో జోక్యం చేసుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.

Also Read: Lunar Eclipse 2021: చంద్ర గ్రహణం ఈ రాశుల వారిపై ప్రభావం చూపుతుంది

కుంభ రాశి
మీరు కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలపై వాదిస్తారు. మీ ఆలోచనలు సరిగా ఉండవు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి వీలుందని గ్రహించరు. పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి.

మీన రాశి
మీకు కావాలసిన సహాయం కోసం ఇతరులను సంప్రదిస్తారు. ఈ రోజు మీకు సహాయం చేయడానికి ఇతరులను అనుమతించండి. కొన్ని శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి. ఉద్యోగుల సమస్యలు తొలగుతాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News