Horoscope Today 6 January 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి లవ్ సక్సెస్ అవ్వడం ఖాయం!

Horoscope Today 6 January 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం కొంతమంది జీవితాల్లో వారు తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. కొంత మందికి పెళ్లి సంబంధాలు కుదురవచ్చు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 07:59 AM IST
Horoscope Today 6 January 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి లవ్ సక్సెస్ అవ్వడం ఖాయం!

Horoscope Today 6 January 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి ఇది పూర్తిగా సానుకూల సమయం. ఉద్యోగాల్లో ప్రమోషన్లు, పెళ్లిళ్లు, కెరీర్ పరంగా ఉన్నత స్థానాలకు చేరుకోవడం, రాజకీయ పరిచయాలు వంటి మార్పులు చోటుచేసుకుంటాయి. 

మేషం:
ఉద్యోగంలో ప్రమోషన్‌కి అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. వ్యాపారులు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ప్రేమ సఫలమవుతుంది. ఆర్థిక లావాదేవీలు జరపవద్దు.

వృషభం:
తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. స్నేహితురాలికి బహుమతులు కొనిస్తారు. వ్యాపారులకు అన్నివిధాల బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది.

మిథునం:
ఆర్థికంగా చాలా బాగుంది. సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి.  వ్యాపారులు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. కోర్టు కేసు అనుకూలం అవుతుంది. ఆరోగ్య ఫర్వాలేదు. 

Also read: Plants grow at home: ఇంట్లో ఈ మొక్కలు నాటి పూజిస్తే.. డబ్బు, సుఖసంతోషాలు మీ సొంతం!

కర్కాటకం: 
ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. స్వల్పంగా అనారోగ్య బాధ తప్పదు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. స్నేహితురాలి మీద ఖర్చు చేస్తారు. 

సింహం: 
ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే ఛాన్స్ ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వ్యాపారులకు బాగుంది.

కన్య:
ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విదేశాల నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ వస్తుంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. 

తుల:
లాయర్లకు, సామాజిక కార్యకర్తలకు అనకూలంగా ఉంది. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.

వృశ్చికం: 
ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. సోదరులతో ఆస్తి తగాదాలు తలెత్తే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచనలున్నాయి. వ్యాపారులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు ఏమంత అనుకూలంగా ఉండకపోవచ్చు.

ధనస్సు:
ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి, స్వయం ఉపాధివారికి అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. బంధువుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

మకరం:
ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. స్థాన చలనానికి అవకాశం ఉంది. రుణ విముక్తులయ్యే ప్రయత్నం చేస్తరు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలకు సమయం కాదు. ప్రేమ వ్యవహారాలు ముందుకు వెళ్లవు. వ్యాపారులు శ్రమపడక తప్పదు.

కుంభం:
ఆదాయం బాగానే ఉంటుంది. కొంతవరకు అప్పులు తీరుస్తారు. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో లక్ష్యాలు పూర్తి చేయడంలో సహోద్యోగులు సహకరిస్తారు. వ్యాపారుల లాభాలు నిలకడగా ఉంయి. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి.

మీనం:
ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ వస్తుంది. పట్టుదలతో కార్యక్రమాలను ప్రారంభించి విజయం సాధిస్తారు. అప్పుల వాళ్ల ఒత్తిడి తగ్గించుకుంటారు. వ్యాపారులకు ఆర్థికంగా కొద్దిగా పర్వాలేదు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమలో ముందడుగు వేస్తారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News