Horoscope Today August 18th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు అనుకోని వివాదంలో చిక్కుకునే ప్రమాదం..

ఇవాళ గురువారం. శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడిన రోజు. కొందరు సాయి బాబాను కూడా పూజిస్తారు. లక్ష్మీ సమేత విష్ణువును పూజించడం ద్వారా భక్తులు శుభ ఫలితాలు పొందుతారు. ఈ గురువారం ఆ దైవ అనుగ్రహం ఎవరిపై ఉంది... ఏయే రాశుల వారి జీవితం ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 18, 2022, 06:50 AM IST
  • ఇవాళ గురువారం.. శ్రీమహావిష్ణువుకి అంకితం చేయబడిన రోజు
  • లక్ష్మీ సమేత విష్ణువును పూజిస్తే మంచి ఫలితాలు పొందుతారు
  • ఈ గురువారం ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందంటే
Horoscope Today August 18th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు అనుకోని వివాదంలో చిక్కుకునే ప్రమాదం..

Horoscope Today August 18th 2022: ఇవాళ గురువారం. శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడిన రోజు. కొందరు సాయి బాబాను కూడా పూజిస్తారు. లక్ష్మీ సమేత విష్ణువును పూజించడం ద్వారా భక్తులు శుభ ఫలితాలు పొందుతారు. ఈ గురువారం ఆ దైవ అనుగ్రహం ఎవరిపై ఉంది... ఏయే రాశుల వారి జీవితం ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి (Aries)

ఆఫీసులో మీ ఆధిపత్యమే నడుస్తుంది. మీ మాటను అందరూ గౌరవిస్తారు. వేతనం పెరిగే అవకాశం ఉంది. మహిళలు వ్యాపారంలో సక్సెస్ అవుతారు. ఉద్యోగస్తులు మునుపటికన్నా మరింత శక్తి సామర్థ్యాలతో పనిచేస్తారు. పని ప్రదేశంలో పాజిటివిటీ మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూల సమయం. యువతకు గుడ్ న్యూస్ అందే అవకాశం ఉంది.

వృషభ రాశి (Taurus)

ఆర్థికపరంగా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. చాలాకాలంగా మీకు రాకుండా నిలిచిపోయిన డబ్బు అందుతుంది. తద్వారా ఆర్థిక స్థితి మెరుగువుతుంది. ఇవాళ ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వొద్దు. ఎక్కడ పెట్టుబడి పెట్టినా ముందు క్షుణ్ణంగా ఆ ప్రాజెక్టు గురించి తెలుసుకోండి. హడావుడిగా పెట్టుబడులు పెట్టొద్దు. లేనిపక్షంలో మీ డబ్బు ఇతరుల చేతికి చిక్కుతుంది. తిరిగి పొందేందుకు చాలా సమయం పడుతుంది.

మిథున రాశి (GEMINI)

పరిచయం లేని ఓ వ్యక్తితో ఒకచోట వివాదం తలెత్తే అవకాశం ఉంది. అనుకోని ఈ వివాదం మానసికంగా మిమ్మల్ని కలవరపెడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేపడుతారు. కుటుంబ సభ్యులు మీతో సమయం గడపాలని కోరుకుంటారు. ముఖ్య విషయాల్లో కుటుంబ సలహా పాటించడం మీకు కలిసొస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. చేపట్టే ప్రతీ పనిని ఆస్వాదిస్తారు.

కర్కాటక రాశి (Cancer) 

ప్రేమలో ఉన్నవారు తమ ప్రేయసి లేదా ప్రియుడి మనసెరిగి ప్రవర్తించాలి. ఏ విషయమైనా ఇద్దరూ కలిసి చర్చించుకున్నాకే ముందడుగు వేయాలి. వివాహితులు జీవిత భాగస్వామి సలహాలకు ప్రాధాన్యతనివ్వాలి. తద్వారా మీ రిలేషన్‌షిప్ కూడా మరింత బలపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. 

సింహ రాశి (LEO)

ఆరోగ్యం మెరుగవుతుంది. పాత అనారోగ్య సమస్యలు నయమవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. మందులు వెంటే ఉంచుకోవాలి. బీపీ సమస్యలతో బాధపడేవారు తప్పక వ్యాయామం చేయాలి. ధ్యానం మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మిమ్మల్ని మీరు అన్వేషించుకునే మార్గం చూపిస్తుంది. మీలోని కోపాన్ని తగ్గిస్తుంది.

కన్య రాశి (Virgo)

వైవాహిక బంధంలో చిక్కుముడులు వీడిపోతాయి. ఒత్తిడి నుంచి బయటపడుతారు. జీవిత భాగస్వామితో మళ్లీ సంతోషంగా గడిపే రోజులు వచ్చినట్లే. తెలిసో తెలియకో జరిగిన పొరపాట్లను పెద్ద మనసుతో మన్నిస్తారు. ఇద్దరు కలిసి ఫ్యామిలీ ఫంక్షన్లకు హాజరవుతారు. సామాజిక విషయాల్లోనూ బాధ్యతగా వ్యవహరిస్తారు. ఎవరైనా సాయం కోరితే తోచిన మేర చేయూతనందిస్తారు.

తులా రాశి (Libra)

వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇవాళ ఎవరికీ డబ్బును అప్పుగా ఇవ్వొద్దు. ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ప్రాఫిట్స్, నష్టాలపై ఒక అవగాహనకు రండి. ఇవాళ మీ ఇంటికి వచ్చే బంధువు లేదా సన్నిహితులు పెట్టుబడులపై మీకు కీలక సూచన చేసే అవకాశం ఉంది. 

వృశ్చిక రాశి (Scorpio)

కొత్తగా పెళ్లయిన జంట శుభవార్త వింటారు. చాలాకాలం తర్వాత ప్రేమికులు ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఏర్పడుతుంది. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకుంటారు. ప్రస్తుతానికి పెళ్లి ప్రస్తావన తీసుకురారు. మిమ్మల్ని మీరు మరీ ఎక్కువగా, లేదా మరీ తక్కువగా ఊహించుకోవడం, పొగడుకోవడం చేయవద్దు. అది మీ ప్రేయసి లేదా ప్రియుడి వద్ద మీ ఇమేజ్‌ను తగ్గిస్తుంది.

ధనుస్సు రాశి (Sagittarius)  

కుటుంబ సభ్యుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి ఆరోగ్యం ఇవాళ కాస్త కుదుటపడుతుంది. అది మీకు కాస్త టెన్షన్ ఫ్రీగా అనిపిస్తుంది. నెగటివ్ ఆలోచనల నుంచి బయటపడుతారు. ఎప్పటిలాగే పనిలో యాక్టివ్ అవుతారు. చేపట్టిన పనిలో కాస్త జాప్యం జరుగుతుంది. సకాలంలో పనులు పూర్తయ్యేందుకు కొలిగ్స్ సాయం కోరుతారు. లేదా ఓవర్‌ టైమ్ వర్క్ చేస్తారు. అది కాస్త మానసిక ఒత్తిడిని పెంచుతుంది.

మకర రాశి (Capricorn) 

మీ ఫ్యామిలీ అంతా ఐక్యంగా ఉంటారు. కుటుంబంలో నెలకొన్న చిన్న చిన్న వివాదాలు సమసిపోతాయి. మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ పెరుగుతుంది. తోబుట్టువులు ఒకరి పట్ల ఒకరు ఆత్మీయతతో ఉంటారు. ఇవాళ మీ ఇంటికి బంధువులు రావొచ్చు. అంతా కలిసి సరదాగా గడుపుతారు. ఆలయాల సందర్శన లేదా విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.

కుంభ రాశి (Aquarius)

వ్యాపారంలో మునుపటికన్నా రెట్టింపు లాభాలు ఆర్థికంగా మిమ్మల్ని తిరుగులేని స్థానంలో నిలబెడుతాయి. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేవారు ఒక్కసారిగా భారీగా లాభాలు పొందుతారు. ఇవాళ మీరు పెట్టబోయే ఏ పెట్టుబడైనా లాభాలు తీసుకొస్తుంది. బిజినెస్ విస్తరణ కలిసొస్తుంది. అప్పులు తీసుకోవడం లేదా ఇవ్వడం మానుకోండి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ రిజల్ట్స్ ఉంటాయి.

మీన రాశి (Pisces) 

వైవాహిక బంధం మరింత బలపడుతుంది. బ్యాచిలర్స్‌కి పెళ్లి సంబంధాలు వస్తాయి. జీవిత భాగస్వామి లేదా ప్రేయసి/ప్రియుడితో క్వాలిటీ టైమ్ గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో పిల్లలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అనారోగ్యం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పెద్దల ఆశీస్సులు మీ చుట్టూ పాజిటివిటీ నెలకొనేలా చేస్తాయి. నెగటివిటీని దూరం చేస్తాయి. 

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also read:CM Jagan Review: అంతా వైద్య కళాశాలల నుంచే..వైద్యారోగ్య శాఖలో కీలక సంస్కరణాలు..!

Also read:Constable Recruitment: తెలంగాణలో కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్..ఇలా హాల్‌ టికెట్లు పొందండి..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News