Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 22 జూన్ 2021, Rasi Phalalu, ఓ రాశివారి చేతికి స్థిరాస్తి

Horoscope Today 22 June 2021: జీవితంలో మీరు మరో అడుగు ముందుకు వేయనున్నారు. సమయానికి బయలుదేరినా వెళ్లవలసిన ప్రాంతానికి మీరు చేరుకోవడానికి అవాంతరాలు ఎదురవుతాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ఉత్తమం. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులు ఆచితూచి అడుగు వేయాలి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 22, 2021, 07:54 AM IST

Trending Photos

Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 22 జూన్ 2021, Rasi Phalalu, ఓ రాశివారి చేతికి స్థిరాస్తి

Horoscope Today 22 June 2021: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి ఓ ప్రత్యేక లక్షణం ఉంటుంది. శ్రీ ప్లవ నామ సంవత్సరం జూన్ 22వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
మీరు కొన్ని విషయాలలో ఆందోళనకు గురవుతారు. గతంలో జరిగిన తప్పిదాన్ని మీరు ఇప్పుడైనా గ్రహించాలి. కుటుంబసభ్యుల మధ్య నెలకొన్న వివాదాలు పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి సిద్ధమవుతారు. పనిచేసే చోట ఉద్యోగులకు విజయం దక్కుతుంది.

వృషభ రాశి
జీవితంలో మీరు మరో అడుగు ముందుకు వేయనున్నారు. సమయానికి బయలుదేరినా వెళ్లవలసిన ప్రాంతానికి మీరు చేరుకోవడానికి అవాంతరాలు ఎదురవుతాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ఉత్తమం. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులు ఆచితూచి అడుగు వేయాలి.

Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్

మిథున రాశి
ఈ సమయంలో అనవసర విషయాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఇంట్లో మీరు కొన్ని విషయాలు మాట్లాడి పరిష్కరించుకోవాలి. తెలియని వాటి గురించి ప్రగల్భాలు పలకడం మానేయండి. మీ వద్ద లేని వస్తువులపై ఆసక్తిగా ఉంటే, మీరు క్లిష్ట పరిస్థితి ఎదుర్కోనున్నారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకోవడంలో విఫలమవుతారు.

కర్కాటక రాశి 
మీరు ఇతరులను ఎలా గౌరవిస్తారు, వారితో ఎలా వ్యవహరిస్తారన్నది కీలకంగా మారనుంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు వెళ్లగా సమస్యలలో చిక్కుకుంటారు. ఏ విషయంలోనూ నిరుత్సాహం చెందవద్దు. భయపడకుండా ధైర్యంగా ముందడుగు వేయాలి. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.  

సింహ రాశి
విద్యార్థులు కెరీర్ గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. కొన్ని శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ప్రేమ లాంటి వ్యవహారాలకు కొంతకాలం దూరంగా ఉండటం శ్రేయస్కరం. అనవసర విషయాలలో జోక్యం ద్వారా గాయపడే సూచనలు కనిపిస్తున్నాయి. చేపట్టిన పనులను పట్టుదలతో సకాలంలో పూర్తి చేసుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.

కన్య రాశి
కొందరితో మీ స్నేహం, రిలేషన్ కోసం సిద్ధంగా ఉంటే, వారిని అనుకోని పరిస్థితులలో కలుసుకుంటారు. మరోవైపు కీలక పనులు పక్కన పెడతారు. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు చేయడం అంత శ్రేయస్కరం కాదు. 

Also Read: Vinayak Chaturthi 2021: వినాయక చతుర్థి ఇవాళ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా ? 

తులా రాశి
నేడు మీకు అన్ని శుభాలు కలుగుతాయి. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న ఆస్తి వివాలు పరిష్కారమవుతాయి. నేడు మీకు వస్తులాభం గోచరిస్తుంది. ప్రతి పని సక్రమంగా జరగాలని భావిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాలలో అది సాధ్యం అవదని గ్రహిస్తారు. ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది.

వృశ్చిక రాశి 
సోషల్ మీడియా, మొబైల్ ద్వారా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే చేసిన తప్పిదాన్ని బట్టి ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇతర ప్రాంతానికి వెళ్లిన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు తలెత్తుతాయి. వ్యాపారులకు కలిసొచ్చే సూచనలున్నాయి.  

ధనుస్సు రాశి
ఆర్థిక సమస్యలు తొలగుతాయి. చేతికి డబ్బు అందడంతో వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటారు. స్నేహితులు, సన్నిహితులతో బయటకు వెళ్లి సరదాగా గడపాలని భావిస్తారు. కొందరి నుంచి మాట పట్టింపులు. విషయం తెలుసుకోకుండా ఇతరులను నిందించడం ద్వారా చికాకులు. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు అందుతాయి.

మకర రాశి
కొన్ని విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికంగా శ్రమించినా పనులు వాయిదా పడతాయి. జీవిత భాగస్వామితో గొడవ పడకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి. పనిలో తీరిక లేకుండా గడుపున్నవారైతే కొంత విరామం తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో పునరాలోచించాలి. 

Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే 

కుంభ రాశి
మీకు ఈ రోజు సానుకూల ఫలితాలు వస్తాయి. తీరిక లేని పనుల కారణంగా ఈ రోజు చాలా అలసిపోతారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఒకవేళ మీరు జాగ్రత్తగా ఉండకపోతే, ప్రతిచోటా సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది. పనిలో ప్రశంసలు పొందుతారు.

మీన రాశి
ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తపడతారు. కొన్ని విషయాలు చికాకు తెప్పిస్తాయి. మీ గతంలో కలిసిన వ్యక్తి మరోసారి మిమ్మల్ని కలుసుకుంటారు. వ్యాపారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యల బారిన పడతారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News