Horoscope Today July 22nd 2022: ఇవాళ శుక్రవారం. హిందువులు లక్ష్మీ దేవిని కొలుస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం సిరి సంపదలు, సుఖ సంతోషాలు కలగజేస్తుంది. మరి ఈ శుక్రవారం ఏయే రాశుల వారిపై జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
మేష రాశి (Aries)
ఇవాళ మీకు శుభదినం. ఈరోజంతా యాక్టివ్‌గా, హెల్తీగా ఉంటారు. ముక్కుసూటిగా వ్యవహరించకపోవడం మంచిది. ఉన్నది ఉన్నట్లు కుండబుద్దలు కొట్టే మాటతీరు వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. వ్యాపారపరంగానూ అది ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ నాలుకను అదుపులో ఉంచుకుంటే మీకు అంతా మంచే జరుగుతుంది. లేనిపక్షంలో వివాదాలు కొనితెచ్చుకుంటారు.
వృషభ రాశి (Taurus)
ఇవాళ మీ శక్తి సామర్థ్యాలు సన్నగిల్లుతాయి. నిరుత్సాహం ఆవహిస్తుంది. పాత అనారోగ్య సమస్యలు మళ్లీ తిరగబెడుతాయి. అది మిమ్మల్ని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తుంది. అడ్వెంచర్ టూర్స్‌ను వాయిదా వేసుకోవాలి. కొన్ని వివాదాలు కోర్టు వెలుపల రాజీతో ముగుస్తాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
మిథున రాశి (GEMINI)
చాలాకాలం క్రితం మీరు పెట్టిన పెట్టుబడి ఇప్పుడు లాభాలను తీసుకొస్తుంది. ఇన్నాళ్లు ఎదురైన నష్టాలన్నీ లాభాలతో భర్తీ అవుతాయి. వ్యాపారంలో కొత్త ప్రణాళికలతో ముందుకెళ్లడంతో కలిసొస్తుంది. ఈరోజంతా ప్రతీ పనిలో మీకు సక్సెస్ ఉంటుంది. ఇవాళ మీరు కలవబోయే ఓ వ్యక్తి నుంచి విలువైన సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. దంపతులకు సంతానం విషయంలో శుభవార్త ఉండొచ్చు.
కర్కాటక రాశి (Cancer)
పని భారం ఎక్కువగా ఉంటుంది. మానసిక అలసట కారణంగా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేరు. వృత్తిరీత్యా మీకు తగిన గౌరవ, మర్యాదలు దక్కుతున్నప్పటికీ.. పని భారం మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతుంది. ఈ ప్రభావం కుటుంబ జీవితంపై ప్రభావం చూపుతుంది. ఉద్యోగాన్ని వీడే ఆలోచన చేస్తారు. ఈ విషయంలో మీ జీవితభాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
సింహ రాశి (LEO)
ఇవాళ మీలోని ఆధ్యాత్మిక శక్తి మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది. మీ ఆలోచనా ధోరణి ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటుంది. మీ దృష్టి ఆధ్యాత్మికత వైపు మళ్లుతుంది. మతపరమైన లేదా పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారు. కొన్ని విషయాల్లో మీ ఆలోచనలు మీతోనే ఉంచుకోండి. ఇతరులతో వాటిపై చర్చించడం మిమ్మల్ని చులకన చేయవచ్చు, లేదా మిమ్మల్ని ఎదుటివారు సరిగా అర్థం చేసుకోకపోవచ్చు.
కన్య రాశి (Virgo)
ఇవాళంతా నీరసం ఆవహిస్తుంది. సహనాన్ని కోల్పోతారు. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికత లేదా ధ్యానం పట్ల ఆసక్తి చూపుతారు. కొన్ని విషయాల్లో మీ అంతరంగాన్ని ఫాలో అవడం మీకు కలిసొస్తుంది. రీసెర్చ్‌లో ఉన్నవారు మరింత లోతైన అధ్యయనం చేసేందుకు ప్రయత్నిస్తారు. తద్వారా విషయ పరిజ్ఞానం మరింత పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
తులా రాశి (Libra)
ఇవాళ మీ జాతకంలో చంద్ర సంచారం మీకు కలిసొస్తుంది. వృత్తి జీవితం, కుటుంబ జీవితం సాఫీగా సాగుతాయి.పెట్టుబడులు లాభాలను తీసుకొస్తాయి. స్నేహితులు లేదా బంధువులు మీరు చేసిన సాయానికి కృతజ్ఞతగా మీకు ఏదైనా వస్తువులు బహుమతిగా ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
వృశ్చిక రాశి (Scorpio)
ఇవాళ మీరు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు. మీ పిల్లల ఆరోగ్యం మెరుగువుతుంది. పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెడుతారు. మీరు చేస్తున్న ఉద్యోగంలో విధేయతను చాటుకుంటారు. కనిపించని శత్రువుల గురించి తెలుసుకుంటారు. వాళ్లను సమర్థవంతంగా కౌంటర్ చేయగలుగుతారు. కుటుంబ జీవితం సాఫీగా, సంతోషకరంగా సాగుతుంది. వ్యాపారులకు ఇది అనుకూల సమయం.
ధనుస్సు రాశి (Sagittarius)
ఉద్యోగ విషయంలో గుడ్ న్యూస్ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు పోటీ పరీక్షలపై మరింత దృష్టి సారించాల్సి ఉంటుంది. అవివాహితులైన సింగిల్స్ తమ సోల్‌మేట్‌ను కలుసుకుంటారు. పెళ్లయి పిల్లలు లేనివారికి సంతానం విషయంలో శుభవార్త ఉండొచ్చు. వ్యాపారస్తులకు ఆకస్మిక ధన లాభం ఉంటుంది. వ్యాపారంలో కొత్త స్ట్రాటజీలు కలిసొస్తాయి.
మకర రాశి (Capricorn)
ప్రస్తుతం నివాసం ఉంటున్న చోటు నుంచి మరో చోటుకు మకాం మార్చే యోచనలో ఉంటారు. ప్రస్తుతానికి ఆ ఆలోచన విరమించుకుంటే మంచిది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెట్టుబడుల జోలికి వెళ్లకపోవడం మంచిది. ఒకవేళ ఇప్పుడు పెట్టుబడులు పెట్టినా.. కొన్ని న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. కొద్దిరోజుల వరకు పెట్టుబడులు నిలిపివేయడం మీకు అన్నివిధాలా శ్రేయస్కరం.
కుంభ రాశి (Aquarius)
ఇంకా పెళ్లి కానివారికి మంచి పెళ్లి సంబంధం రావొచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి శుభవార్త అందుతుంది. ప్రస్తుతం మీరు కొనసాగుతున్న రంగంలో విశేషంగా రాణిస్తారు. ఉద్యోగస్తులైతే ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు. మీ పురోగతి మీ పట్ల గౌరవాన్ని పెంచుతుంది. ఇతరులకు సాయం చేసే విషయంలో మీ దయాగుణం అందరికీ నచ్చుతుంది.
మీన రాశి (Pisces)
పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.తద్వారా మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఫ్యామిలీ బిజినెస్‌లో వేగవంతమైన పురోగతి ఉంటుంది. గతంలో వాయిదాపడ్డ పనులు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. కొత్త కాంట్రాక్టులకు సంతకం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ఇంటి మరమత్తులు లేదా కొత్త ఇల్లు కొనుగోలుకు అవకాశం ఉంది.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)
Also Read: Droupadi Murmu Becomes President: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘన విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook