Horoscope Today June 13th : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఇవాళ అనుకోని వ్యక్తి నుంచి సాయం..

Horoscope Today June 13th 2022: ఈరోజు సింహ రాశి వారు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి రావొచ్చు. కన్యా రాశి వారు భూమిని విక్రయించే ప్రయత్నాలు చేస్తారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 13, 2022, 06:29 AM IST
  • నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు
  • మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు
  • ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయంటే..
 Horoscope Today June 13th : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఇవాళ అనుకోని వ్యక్తి నుంచి సాయం..

Horoscope Today June 13th 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఇవాళ వృషభ, మిథున, కర్కాటక తదితర రాశుల వారికి అన్నివిధాలా కలిసొస్తుంది. మేష, సింహ తదితర రాశుల వారికి ఇవాళ నిరాశజనకమైన ఫలితాలు ఉంటాయి. ఇవాళ్టి రాశి ఫలాల్లో.. ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇప్పుడు చూద్దాం... 
 
మేషరాశి (Aries)

ప్రేమ బంధంలో ఉన్నవారికి ప్రేయసి లేదా ప్రియురాలి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసర వాగ్వాదాలు, వివాదాల జోలికి వెళ్లకండి. వీలైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. డబ్బు సంపాదించాలనే కోరిక మీలో మరింత పెరుగుతుంది.

వృషభ రాశి (Taurus)

మీ తల్లి నుంచి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. మీ ప్రవర్తన అందరి పట్ల ఆప్యాయంగా ఉంటుంది. దానివల్ల ప్రతి ఒక్కరి మనసులో మీ పట్ల అనుబంధం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. చేపట్టే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు. మీపై మీకు నమ్మకం రెట్టింపవుతుంది. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు.

మిథున రాశి (GEMINI)

కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. మీరు కొత్తగా చేపట్టే పనులకు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారంలో ఇతరుల నుంచి పెట్టుబడులు స్వీకరిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలు తీసుకొస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

కర్కాటక రాశి (Cancer) 

మీరు చేస్తున్న వ్యాపారంతో పాటు కొన్ని కొత్త రంగాలలో పెట్టుబడి పెట్టడానికి ప్రేరణ పొందుతారు. భూమి లేదా షేర్లలో పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాల కారణంగా ఆర్థికంగా బలపడుతారు. బంధువులు లేదా సన్నిహితులు మీ నుంచి సాయం ఆశించవచ్చు.

సింహ రాశి (LEO)

ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తులు రాజకీయ రంగంలోని వ్యక్తుల నుంచి సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎలాంటి సవాళ్లు ఎదురైనా మీ మనసు చెప్పినట్లు చేయండి. అక్రమ మార్గాల్లో వెళ్లడం ఏమాత్రం మంచిది కాదని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ చేసి ఊహించుకోవద్దు.

కన్య రాశి (Virgo)

మీ పేరిట ఉన్న భూమిని విక్రయించాలని చూస్తారు. భూవిక్రయం ద్వారా వచ్చిన డబ్బులతో మరో చోట ప్రాపర్టీ కొనేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఆచీ తూచీ వ్యవహరించాలి. లేనిపక్షంలో భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం.

తులా రాశి (Libra)

ప్రైవేట్ రంగంలో పనిచేసేవారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. చేపట్టే ప్రతీ పనిని ఆస్వాదిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు, సహకారం లభిస్తుంది. ఇంట్లో వాళ్లతో కలిసి పుణ్యక్షేత్రాలు లేదా అనాథాశ్రమాలను సందర్శిస్తారు. మతపరమైన కార్యక్రమాలు లేదా స్వచ్చంద సేవా కార్యక్రమాలకు తోచిన సాయం చేస్తారు.

వృశ్చిక రాశి (Scorpio)

విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది. పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లో నిమగ్నమైనవారికి అనుకూల సమయం. వారు విజయం సాధించే అవకాశం మెండుగా ఉంది. అయితే అతి ఆత్మవిశ్వాసం మంచిది కాదని గుర్తుంచుకోండి. కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాలు ప్రయోజనం కలిగిస్తాయి.

ధనుస్సు రాశి (Sagittarius)  

పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేస్తారు. ఇది భవిష్యత్తులో వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. ఒకరకంగా ఇది వారి మేధోతనాన్ని మరింత పదును పెడుతుంది.

మకర రాశి (Capricorn

వివాహితులు తమ జీవిత భాగస్వామితో కొన్ని మరపురాని అనుభవాలను పొందుతారు. అత్తమామల వైపు నుంచి పూర్తి సహాయ, సహకారాలు లభిస్తాయి. దీని కారణంగా మనస్సు సంతోషంగా ఉంటుంది.

కుంభ రాశి (Aquarius)

మీరు ఊహించని వ్యక్తి నుంచి సాయం పొందుతారు. అది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మీ ఆలోచనల్లో కొంత మార్పు వస్తుంది. మిమ్మల్ని మీరు విశ్లేషించుకుని మీలోని లోటుపాట్లను గ్రహిస్తారు. మానసికంగా మరింత ధృఢంగా మారుతారు. 

మీన రాశి (Pisces) 

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నవారికి ఇవాళ మంచి సంబంధం రావొచ్చు. తగిన జోడీ కుదిరే అవకాశం ఉంది. దానివల్ల వారి మనసు ఆనందంగా ఉంటుంది. మీరు ఇప్పటికే ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే.. వారితో మనసు విప్పి మాట్లాడేందుకు ఇవాళ అనుకూల సమయం.

Also Read: India vs SA T20: టీమ్ ఇండియాపై 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం

Also Read: Attack on Venkayamma: దళిత మహిళ కుటుంబంపై ఇంత దారుణమా: వెంకాయమ్మపై దాడిని ఖండించిన చంద్రబాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News