Rahu Effect: ఇంట్లోని ఈ ప్రదేశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే.. రాహువు ఆగ్రహానికి బలవక తప్పదు!

Person gets troubles with Rahu Effect. రాహువు ఓ వ్యక్తి జాతకంలోనే కాదు ఇంట్లో కూడా ఉంటాడు. ఇంట్లోని ఈ రెండు చోట్ల శుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకుంటే.. రాహువు ఆగ్రహానికి బలవక తప్పదు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 5, 2022, 09:12 AM IST
  • ఇంట్లోని ఈ ప్రదేశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
    \
  • అలా అయితే రాహువు ఆగ్రహానికి బలవక తప్పదు
  • రాహువు దుష్ప్రభావాల కారణంగా ఒత్తిడిలో వ్యక్తి జీవితం
Rahu Effect: ఇంట్లోని ఈ ప్రదేశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే.. రాహువు ఆగ్రహానికి బలవక తప్పదు!

If these places in the house not clean person gets troubles with Rahu Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలు ఉంటాయి. వాటినే మనం నవ గ్రహాలు అని కూడా పిలుస్తుంటాం. ఇందులో రాహు-కేతువులు ఛాయా గ్రహాలు. ఓ వ్యక్తి జాతకంలో రాహువు దశ బాగాలేకుంటే.. సదరు వ్యక్తి జీవితం గందరగోళానికి గురవుతుంటుంది. వ్యక్తి జాతకంలో రాహుదోషం ఉంటే.. అతడు అనేక రకాల శారీరక, మానసిక మరియు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.  అంతేకాదు రాహువు దుష్ప్రభావాల కారణంగా వ్యక్తి జీవితం పూర్తిగా ఒత్తిడిలో పడుతుంది.

రాహువు ఓ వ్యక్తి జాతకంలోనే కాదు ఇంట్లో కూడా ఉంటాడు. ఇంట్లోని ఈ రెండు చోట్ల శుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకుంటే.. రాహువు ఆగ్రహానికి బలవక తప్పదు. ఆ ప్రదేశాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం. పూర్వకాలంలో ఇంటిలోపల మరుగుదొడ్లు నిర్మించుకోవడం అశుభంగా భావిస్తారు కాబట్టి ఇంటిబయటే నిర్మించుకునేవారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోపల నిర్మించుకున్న మరుగుదొడ్లు ప్రతికూల శక్తిని వ్యాప్తి చేస్తాయట. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం బాత్రూంలో చంద్రుడు, మరుగుదొడ్డిలో రాహువు ఉంటాడని నమ్ముతారు. అలాంటిడి రెండూ ఒకచోట కలిస్తే.. ప్రతికూల శక్తి ఉంటుందట. 

చంద్రుడు, రాహువు ఒకచోట ఉంటే.. ఇంట్లో నివసించే వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెపుతోంది. దీనినుంచి తప్పించుకోవాలంటే.. ఇంట్లోని టాయిలెట్‌ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వాస్తు ప్రకారం టాయిలెట్‌లో కొద్దిగా కర్పూరాన్ని కాల్చవచ్చు. అలాకాకుండా గిన్నెలో పెట్టి ఓ మూలన పెట్టుకున్నా.. మరుగుదొడ్డిలోని నెగటివ్ ఎనర్జీ తగ్గి రాహుదోషం తగ్గుతుందట. 

వాస్తు శాస్త్రం ప్రకారం రాహువు ఇంటి మెట్లపై కూడా ఉంటాడట. అందుకే ఇంటి మెట్లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఏదైనా మెట్టు విరిగిపోయిన వెంటనే దాన్ని వెంటనే సరిచేయాలి. వాస్తు ప్రకారం ఇంటి మెట్లు సరైన దిశలో ఉండలు. మెట్లను అశుభ్రంగా ఉంచడం ద్వారా రాహువు ఉత్తేజితం అవుతాడు. అప్పుడు ఆ ఇంట్లోని వ్యక్తి జీవితం గందరగోళానికి గురవుతాడు. వ్యక్తిని అప్పుల ఊబిలోకి కూరుకుపోయే అవకాశం ఉంటుంది. మెట్ల కింద మరుగుదొడ్లు, స్నానపు గదులు అసలు నిర్మించవద్దు. పనికిరాని వస్తువులను కూడా మెట్ల కింద ఉంచవద్దు.

Also Read: నన్ను ఇస్లాంలోకి మారమని షాహిద్ అఫ్రిది ఒత్తిడి తెచ్చాడు: భారత స్పిన్నర్

Also Read: Hyderabad MMTS: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి టికెట్ ధరల తగ్గింపు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News