Jupiter Rise 2023: గురు మీనరాశి ప్రభావం, ఏప్రిల్ నుంచి ఆ మూడు రాశులకు రాజయోగం, పట్టిందల్లా బంగారమే

Jupiter Rise 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం, రాశి పరివర్తనం ప్రభావం వివిధ గ్రహాలపై వివిధ రకాలుగా ఉంటుంది. ఒక్కోసారి గ్రహాల రాశి పరివర్తనం రాజయోగం ఏర్పరుస్తుంటుంది. అలా జరిగినప్పుడు  కొన్ని రాశులకు ఊహించని అద్భుత లాభాలు చేకూరుతాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 20, 2023, 12:28 PM IST
Jupiter Rise 2023: గురు మీనరాశి ప్రభావం, ఏప్రిల్ నుంచి ఆ మూడు రాశులకు రాజయోగం, పట్టిందల్లా బంగారమే

హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏ గ్రహమైనా రాశి పరివర్తనం చెందినప్పుడు ఆ ప్రభావం అన్ని రాశులపై స్పష్టంగా కన్పిస్తుంది. ఈ ప్రభావం అనేది కొన్ని రాశులపై శుభంగా, మరికొన్ని రాశులపై అశుభంగా ఉంటుంది. ఇప్పుడు గురు గ్రహం గోచారం ప్రభావం గురించి తెలుసుకుందాం..

గురుడు  మీనరాశిలో ప్రవేశించనున్నాడు. ఈ గోచారం కేంద్ర త్రికోణ రాజయోగాన్ని ఏర్పరుస్తుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. దేవగురువుగా భావించే గురుడు లేదా బృహస్పతి ఏప్రిల్ నెలలో మీనరాశిలో ఉదయించనున్నాడు. ఈ సందర్భంగా ఏర్పడనున్న త్రికోణ రాజయోగంతో మూడు రాశులకు దశ పూర్తిగా తిరిగిపోనుందని తెలుస్తోంది. ఈ రాజయోగం ప్రభావం ఈ మూడు రాశులపై స్పష్టంగా కన్పించనుంది. 3 రాశులవారికి ఊహించని ధనలాభముంటుంది.

కర్కాటక రాశి

గురుగ్రహం ఉదయించడం వల్ల కర్కాటక రాశిలో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడనుంది. గురుడు తన రాశి నుంచి 9వ పాదంలో గోచారం చేయనున్నాడు. ఈ సమయంలో అదృష్టం పూర్తిగా తోడవనుంది. పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారం నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. ఇది భవిష్యత్తులో లాభదాయకమౌతుంది. విదేశాలకు వెళ్లి చదివేవారి కోర్కెలు నెరవేరుతాయి. విద్యార్ధులు రాణిస్తారు. 

మిథున రాశి

ఈ రాశి జాతకులకు కేంద్ర త్రికోణ రాజయోగం శుభసూచకం కానుంది. గురుడు ఈ రాశి దశమ పాదంలో ఉదయించనున్నాడు. ఈ క్రమంలో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు ఈ సమయంలో ఇంక్రిమెంట్లు, పదోన్నతి లభిస్తుంది. అంతేకాకుండా, కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. జ్యోతిష్యం ప్రకారం ఈ రాశి కుండలిలో హంస రాజయోగం ఏర్పడనుంది. పాత పెట్టుబడులు లాభాల్ని ఇస్తాయి.

కుంభ రాశి

కుంభ రాశివారికి గురుడు ఉదయించడం అనేది శుభ సూచకం కానుంది. గురువు మీ గోచారం కుండలిలో 2వ పాదంలో ఉదయించనున్నాడు. ఈ నేపధ్యంలో ధనలాభం కలగనుంది. ఫలితంగా మీ ఆర్ధిక పరిస్థితి పటిష్టమౌతుంది. జనవరి 17 నుంచి ఈ రాశివారికి ఉన్న శని సాడేసతి తొలగిపోతుంది. ఫలితంగా నిలిచిపోయిన పనులు పూర్తయిపోతాయి.

Also read: Surya shani gocharam 2023: మార్చ్ 15 మరో 25 రోజులు ఆ మూడు రాశులకు ఈ కష్టాలు తప్పవు, జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News