Jupiter Transit 2024: మృగశిర నక్షత్రంలోకి బృహస్పతి.. ఈ రాశుల వారికి కనక వర్షమే, ఊహించని శుభవార్తలు వింటారు!

Jupiter In Mrigashira Nakshatra 2024 In Telugu: ఆగస్టు 20వ తేదీన బృహస్పతి గ్రహం మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యక్షమైన ప్రభావం పడబోతోంది. దీనికి కారణంగా వారు అద్భుతమైన ఆధార వనరులు పొందగలుగుతారు. అంతేకాకుండా జీతం రెట్టింపు అవుతుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 11, 2024, 11:24 AM IST
Jupiter Transit 2024: మృగశిర నక్షత్రంలోకి బృహస్పతి.. ఈ రాశుల వారికి కనక వర్షమే, ఊహించని శుభవార్తలు వింటారు!

Jupiter In Mrigashira Nakshatra 2024 In Telugu: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రాలను గ్రహాలను నక్షత్రాలను గ్రహసంచారాలను చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. ముఖ్యంగా ఒక గ్రహం సంచారం చేయడం కారణంగా మేష రాశి నుంచి మీన రాశి వరకు ఎంతో ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఇదిలా ఉంటే జ్యోతిష్య శాస్త్రం పరంగా బృహస్పతి గ్రహానికి మరెంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాన్ని సంపద, ఆనందం, అదృష్టం, పిల్లలకు సూచికగా భావిస్తారు. కాబట్టి ఈ గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉన్నవారికి ఎలాంటి పనుల్లోనైనా విజయాలు కలుగుతాయి. అంతేకాకుండా అదృష్టం లభించి ధనవంతులవుతారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ బృహస్పతి గ్రహం అతి త్వరలోనే నక్షత్ర సంచారం చేయబోతోంది. ఈ నక్షత్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యక్షమైన ప్రభావం పడుతుంది. ఈ గ్రహం ఆగస్టు 20వ తేదీన సాయంత్రం 5 గంటలకు రోహిణి నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా నవంబర్ 28 వరకు కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారికి జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. దీంతో పాటు చిన్న చిన్న సమస్యల నుంచి కూడా పరిష్కారం దొరకబోతోంది. అలాగే మానసిక సమస్యలు తొలగిపోబోతున్నాయి .

బృహస్పతి నక్షత్ర సంచారంతో అత్యధిక లాభాలు పొందే రాశులు..
మేషరాశి: 

బృహస్పతి సంచారంతో మేష రాశి వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి సమాజంలో అపారమైన గౌరవం లభిస్తుంది. అలాగే వ్యాపారాలు ఉద్యోగాలు చేసే వారికి కొత్త ఆదాయ వనరులు లభించడమే కాకుండా ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ కూడా లభించి జీతాల పెంపు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మానసిక సమస్యల నుంచి విముక్తి లభించబోతోంది. అంతేకాకుండా వాస్తు సౌఖ్యం పెరిగి సంపాదనలో అనేక మార్పులు రాబోతున్నాయి.

వృషభరాశి: 
బృహస్పతి సంచారం వృషభ రాశి వారికి వైవాహిక జీవితంలో సంతోషాన్ని ఇవ్వబోతోంది. అలాగే వీరికి ఎప్పటినుంచో వస్తున్న ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా పరిష్కారం లభించబోతోంది. అంతేకాకుండా కెరీర్ కు సంబంధించిన విషయాల్లో కూడా విజయాలు సాధించబోతున్నారు. అలాగే బృహస్పతి అనుగ్రహంతో గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు రెట్టింపు పై తిరుగు రాబోతోంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి పరిస్థితులు అన్నీ అనుకూలంగా మారి.. కొత్త ఆదాయ వనరులు లభించబోతున్నాయి. పాత పెట్టుబడుల్లో డబ్బు తిరిగి రాబోతోంది. వ్యక్తిగత జీవితంలో కూడా అనేక మార్పులు ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

కన్యా రాశి: 
కన్యా రాశి వారికి కూడా బృహస్పతి సంచారం చాలా విశేషంగా ఉండబోతోంది. అనుకున్న వాటికంటే ఎక్కువగానే లాభాలు అందించబోతున్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి మార్పులు వచ్చి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి మంచి ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా కెరీర్‌కు సంబంధించిన జీవితంలో కూడా కొన్ని శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు కూడా కలుగుతాయి. వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. దీని కారణంగా వీరు  మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే పూర్వీకుల ఆస్తులు కూడా ఈ రాశి వారికి లభిస్తాయి.

ధనస్సు రాశి: 
బృహస్పతి గ్రహం నక్షత్ర సంచారం కారణంగా ధనస్సు రాశి వారిపై కూడా ప్రత్యక్షమైన ప్రభావం పడబోతోంది. దీని కారణంగా వీరికి అనుకున్న లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఎలాంటి పనులు చేసిన డబ్బు విపరీతంగా వస్తుంది. వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. దీని కారణంగా వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. ఉద్యోగాలు చేసేవారు క్లైంట్ లొకేషన్‌కి వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా వీరి జీతాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అనుకున్న పనుల్లో ఎంతో తొందరగా విజయాలు సాధిస్తారు.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News