Jupiter in Pisces: మీనరాశిలో గురు గ్రహం వక్రమార్గం, ఆ మూడు రాశులకు జూలై 29 నుంచి ఏం జరుగుతుంది

Jupiter in Pisces: జ్యోతిష్యశాస్త్రంలో రాశులు, గ్రహాల గురించి సవివరంగా ఉంది. జూలై 29న గురు గ్రహం మీనరాశిలో వక్రమార్గం పట్టనున్నాడు. ఆ రోజు నుంచి ఆ మూడు రాశులపై తీవ్రమైన ప్రభావాలు పడనున్నాయి. అవేంటో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 1, 2022, 12:05 AM IST
Jupiter in Pisces: మీనరాశిలో గురు గ్రహం వక్రమార్గం, ఆ మూడు రాశులకు జూలై 29 నుంచి ఏం జరుగుతుంది

Jupiter in Pisces: జ్యోతిష్యశాస్త్రంలో రాశులు, గ్రహాల గురించి సవివరంగా ఉంది. జూలై 29న గురు గ్రహం మీనరాశిలో వక్రమార్గం పట్టనున్నాడు. ఆ రోజు నుంచి ఆ మూడు రాశులపై తీవ్రమైన ప్రభావాలు పడనున్నాయి. అవేంటో తెలుసుకుందాం..

హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది చాలా గ్రహాలు రాశి మారనున్నాయి. జూలై నెలలో ఇప్పటి వరకూ చాలా గ్రహాల గోచారం జరిగింది. కొన్ని గ్రహాలు జూలై నెలాఖరులో రాశి మారనున్నాయి. జూలై 29వ తేదీన గురు గ్రహం మీనరాశిలో ప్రవేశించనున్నాడు. మీనరాశిలో ప్రవేశిస్తూనే గురుడు వక్రమార్గం పట్టనున్నాడు. 2022 నవంబర్ 24వ తేదీ వరకూ గురుడు ఇదే రాశిలో ఉండనున్నాడు. ఫలితంగా 12 రాశులపై కూడా ప్రభావం పడుతున్నా..మూడు రాశులపై మాత్రం తీవ్ర ప్రభావం పడనుంది. గురుడి మీనరాశి ప్రవేశంతో మేష, మీన, మిధునరాశులవారికి ఇబ్బందులు తప్పవంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆ మూడు రాశులకు తీవ్రమైన కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుందంటున్నారు. ఆ రాశులేంటో పరిశీలిద్దాం..

మేషరాశివారిపై గురుడి మీనరాశి ప్రభావం అశుభంగా ఉంటుంది. ఎందుకంటే మీనరాశిలో ఇప్పటికే రాహువు ఉన్నాడు. ఇప్పుడు గురుడు కూడా ప్రవేశించడంతో ఆ రెండింటి కలయిక ప్రభావం మేషరాశివారి జీవితంపై దుష్ప్రభావం చూపించనుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురౌతాయి. అటు గోచారం సమయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో సమస్యలు ఎదురుకావచ్చు.

మిధునరాశివారిపై కూడా ఈ సమయం కష్టంగా మారనుంది. మిధున రాశిలో ముందు నుంచే బుధుడు, శుక్రుడు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జూలై 29న గురు గోచారంతో మూడు గ్రహాల కలయిక సంభవించనుంది. ఇది ఆర్ధిక సమస్యల్ని సృష్టిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతునమనారు. మరొకర్నించి మీ డబ్బులు తీసుకోవడంలో కూడా మీకు ఇబ్బందులు రావచ్చు.

మీనరాశివారికి గురుడు వక్రమార్గం కారణంగా వైవాహిక సుఖానికి దూరమౌతారు. అంతేకాకుండా గురు గోచారం ఫలితంగా మీనరాశివారికి తలపెట్టిన పనులకు ప్రతిఫలం అంత త్వరగా లభించదు. ఈ పరిస్థితుల్లో గురు గ్రహాన్ని బలోపేతం చేసేందుకు విష్ణు ఉపాసన చేయాల్సి వస్తుందంటున్నారు. గురుడి మీనరాశి వక్రమార్గం కారణంగా ఈ మూడు రాశులవాళ్లు చాలా అప్రమత్తంగా ఉండాలి.

Also read: Lakshmi Pooja: వారానికి రెండ్రోజులు ఇలా పూజలు చేస్తే చాలు..లక్ష్మీదేవి ఇక మీ ఇంట్లోనే

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News