Kalashtami 2024 Most Powerful Remedies: హిందూ సంప్రాదాయం ప్రకారం, కాలాష్టమి పండుగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండగను తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే.. ఇతర రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగ రోజున శివుని ఉగ్ర రూపమైన కాల భైరవుని ఆరాధన చేయడం ఆనవాయితిగా వస్తోంది. ఈ రోజు కాల భైరవుడిని పూజించడమే కాకుండా లక్ష్మీదేవిని పూజించడం వల్ల కూడా అనేక సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.. హిందూ సంప్రాదాయం ప్రకారం, కాలభైరవుడుని ఆనందం, శ్రేయస్సుకు సూచికగా భావిస్తారు. కాబట్టి కాలాష్టమి పండుగ రోజున ఈ క్రింది 5 పరిహారాలు పాటించడం వల్ల కాలభైరవుడి అనుగ్రహం లభిస్తుది. అంతేకాకుండా జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే ఈ రోజు ఏయే పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకోండి.
తెలుగు పంచాంగం ప్రకారం.. ఈ కాలాష్టమి పండుగ ప్రతి ఏడాది నవంబర్ నెలలో జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం కూడా మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్ష అష్టమి తిథి జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ తిథి నవంబర్ నెల 22 శుక్రవారం సాయంత్రం నుంచి మొదలు కాబోతోంది. అయితే ఈ పండగ సమయం నవంబర్ 23వ తేదీ శనివారం రాత్రి 7:56 గంటలకు వరుకు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ సమయంలో కాలభైరవుడిని పూజించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అలాగే శాస్త్ర నిపుణులు తెలిపిన సమయాల్లో పూజించడం వల్ల అనేక సమస్యలు దూరమవుతాయి.
కాలాష్టమి రోజు చేయాల్సి పరిహారాలు:
నల్ల నువ్వుల దానం:
కాలాష్టమి రోజున శని దేవుడికి ఎంతో ఇష్టమైన నువ్వులను దానం చేయడం వల్ల కాల భైరవుడి అనుగ్రహం లభిస్తుది. దీని వల్ల పాపాలన్నీ సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా మోక్షం కూడా లభిస్తుంది. అలాగే ఎలాంటి సమస్యలైనా సులభంగా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణలు తెలుపుతున్నారు.
ఇనుప వస్తువుల దానం చేయడం:
కాలాష్టమి రోజు కాల భైరవుడిని పూజించి ఏవైనా ఇనుప వస్తువులు దానం చేయడం వల్ల శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఎలాంటి పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు. అలాగే దీర్ఘకాలికంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా పూర్తిగా తొలగిపోతాయి.
నల్ల కుక్కకు రొట్టెలు తినిపించడం మంచిది:
నల్ల కుక్క కాల భైరవుని వాహనంగా చెప్పుకుంటారు. కాబట్టి కాలాష్టమి రోజు భైరవుడిని పూజించి.. నల్ల కుక్కకు రోటీలు తినిపించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా రోటీలు అందుబాటులో లేనివారు ఈ రోజు బ్రెడ్‌ను కూడా తినిపించవచ్చు.
ఈ మంత్రాన్ని పఠించడం:
కాలాష్టమి పండగ రోజున ఎంతో పవర్‌ఫుల్ భైరవుడికి సంబంధించిన "ఓం క్లీం కాళికాయై నమః" అనే మంత్రాన్ని ఉదయాన్నే పఠించడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా అన్ని కష్టాలు కూడా గట్టెక్కుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఆవనూనె దీపం వెలిగించండి:
కాలాష్టమి పండగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ రోజు ఆవనూనె దీపం వెలిగించడం చాలా మంచిది.. కాల భైరవుడి స్వామి ముందు ఆవనూనె దీపాన్ని వెలిగించి కోరికలు కోరుకోవడం వల్ల సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా ఇంట్లో ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.