Ketu Gochar 2023: న్యూ ఇయర్ లో కేతు గ్రహం ఈ రాశులను ఇబ్బంది పెడతాడు... ఇందులో మీరున్నారా?

Ketu Gochar 2023: జ్యోతిష్యశాస్త్రంలో కేతు గ్రహాన్ని ఛాయా గ్రహంగా అంటారు. దీని సంచార ప్రభావం ప్రజంలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2023, 12:56 PM IST
Ketu Gochar 2023: న్యూ ఇయర్ లో కేతు గ్రహం ఈ రాశులను ఇబ్బంది పెడతాడు... ఇందులో మీరున్నారా?

Ketu Transit 2023 Effect: ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరాన్ని కోటి ఆశలతో ప్రారంభిస్తారు. ఏడాదింతా ఎలాంటి సమస్యలు రాకూడదని కోరుకుంటారు. 2023లో అంతరిక్షంలో గ్రహాలు మరియు రాశుల కదలిక ప్రతి ఒక్కరి జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతాయి. ఆస్ట్రాలజీలో కేతు గ్రహాన్ని ఛాయా గ్రహంగా భావిస్తారు. నూతన సంవత్సరంలో కేతువు తన రాశిని మార్చబోతున్నాడు. గత ఏడాది ఏప్రిల్ 12న కేతువు తులరాశిలోకి ప్రవేశించాడు. 2023లో కేతువు అక్టోబర్ 30, మధ్యాహ్నం 1.33 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశించనుంది. ఈ సమయంలో ఏ రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. 

కేతు సంచారం ఈ రాశులకు అశుభం
మేషం (Aries)- కేతు సంచారం సమయంలో ఈ రాశివారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోనే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోండి. పార్టనర్ షిప్ తో చేసే బిజినెస్ లో మీరు మోసపోయే అవకాశం ఉంది. 
మిథున రాశి (Gemini)- ఈ సమయం మిథునరాశివారికి కొంచెం కష్టంగా ఉంటుంది. కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఈ టైంలో మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. 
కర్కాటక రాశి (Cancer)- కర్కాటక రాశివారు ఈ కాలంలో వృత్తి సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు ఈ సమయంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే దానిని విరమించుకోండి. 

కన్య రాశి (Virgo)- ఈ సమయంలో కన్యా రాశి వారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. బిజినెస్ లో పెట్టుబడి పెట్టడం మానుకోండి. కుటుంబంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. 
మీనం (Pisces)- ఈ సమయం మీన రాశి వారికి అనుకూలం కాదు. ఈ సమయంలో మీరు ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. మీరు మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి, లేకపోతే ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. 

Also Read: Mangal Gochar 2023: మంగళ మార్గి ఎఫెక్ట్... కొత్త ఏడాదిలో ఈ 3 రాశులకు తిరుగుండదు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News