Ketu Gochar 2023: ఒక గ్రహం లేదా నక్షత్రరాశి సుదూర ప్రదేశంలో తన కదలికను మార్చుకున్నప్పుడల్లా, అది అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. జ్యోతిషశాస్త్రంలో కేతువును ఛాయాగ్రహంగా భావిస్తారు. కేతు సంచారం కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. 2023లో కేతువు తులారాశిని వదిలి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. సాధారణంగా కేతు గ్రహం ఏడాదిన్నరకొకసారి తన రాశిని ఛేంజ్ చేస్తుంది.
కేతు సంచారం ఎప్పుడు?
రాహువు మరియు కేతువులు ఒకే రాశిలో ఒకటిన్నర సంవత్సరాలు ఉంటారు. అక్టోబర్ 30, 2023న, తులారాశిని విడిచిపెట్టి కేతువు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశి మార్పు మధ్యాహ్నం 1.33 గంటలకు జరుగుతుంది. దీని సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశిలో కేతువు పదకొండవ ఇంట్లో కూర్చుంటాడు. దీంతో మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. అయితే వ్యాపారంలో మాత్రం పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ సమస్యలన్నీ తీరుతాయి. షేర్ మార్కెట్‌తో అనుబంధం ఉన్న వ్యక్తులు లాభాలను పొందుతారు.
మకరరాశి
మకర రాశిలో కేతువు పదో ఇంటిలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో కుటుంబంతో విభేదాలు తలెత్తవచ్చు. దీంతో మీలో ధైర్యం పెరుగుతుంది. వ్యాపారంలో పురోగతికి మార్గం తెరవబడుతుంది. మకర రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆఫీసులో మీ ప్రాబల్యం పెరుగుతుంది. సహచరుల సపోర్టు లభిస్తుంది.
వృషభం
ఈ రాశిచక్రంలోని ఆరవ ఇంట్లో కేతువు సంచారం జరగనుంది. దీంతో నిలిచిపోయిన మీ పనులన్నీ పూర్తవుతాయి. అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది. నిరంతరం శ్రమిస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు మంచి రిజల్ట్స్ సాధిస్తారు. అనారోగ్యం నుండి బయటపడతారు.
సింహరాశి
సింహ రాశి యెుక్క మూడవ ఇంట్లో కేతువు సంచరిస్తున్నాడు. దీంతో మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. డబ్బు సమస్యలు కూడా దూరమవుతాయి. మీరు ముందుకు సాగడంలో సహోద్యోగులు సహాయం లభిస్తుంది.
Also Read: Trigraha yogam: కుంభరాశిలో త్రిగ్రహ యోగం, ఈ మూడు రాశులకు ఊహించని ధనలాభం, ఉద్యోగావకాశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook