/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

 

Krishna Janmashtami 2023: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం..ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమిని భాద్రపద మాసంలోని కృష్ణ పక్షంలోని 8వ రోజున జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు ద్వాపర యోగంలో ఇదే రోజున ఆర్ధరాత్రి జన్మించారు. అయితే ఇదే సమయంలో రోహిణీ నక్షత్రం కూడా అనుకూల స్థానంలో ఉంటుంది. అందుకే జన్మాష్టమి రోజున రోహిణి నక్షత్రంగా పరిగణిస్తారు. ఈ సంవత్సరంలో రోహిణి నక్షత్రం, అష్టమి తిథి కారణంగా జన్మాష్టమి తేదీపై గందరగోళం నెలకొందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సంవత్సరం జన్మాష్టమిని ఏయే తేదిల్లో జరుపుకోవాలో, ఏయే సమయాల్లో శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

భాద్రపద కృష్ణ అష్టమి తిథి సమయాలు:
✾ భాద్రపద కృష్ణ అష్టమి తిథి సమయాలు: సెప్టెంబర్ 06న మధ్యాహ్నం 03:37 ప్రారంభం.
✾ భాద్రపద కృష్ణ అష్టమి తిథి ముగింపు సమయం: సెప్టెంబర్ 07న సాయంత్రం 04:14 గంటలకు మగుస్తుంది.

రోహిణి నక్షత్ర సమయం:
ఈ సంవత్సరం రోహిణి నక్షత్రం సెప్టెంబర్ 06న ఉదయం 09:20 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 07న ఉదయం 10:25 గంటలకు ముగుస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి హిందువులంతా జన్మాష్టమి సెప్టెంబర్ 6వ తేదీన  జరుపుకోవడం శుభప్రదమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజు రోహిణి నక్షత్రం శుభ ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి కృష్ణుడిని పూజించేవారు ఈ రోజు రాత్రి పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్ 

జన్మాష్టమి శుభ సమయాలు:
శ్రీ కృష్ణ జన్మాష్టమి పూజ సమయం విషయానికొస్తే.. జన్మాష్టమి శుభ సమయం 06 సెప్టెంబర్ రాత్రి 11:57 నుంచి 07 సెప్టెంబర్ ఉదయం 12:42 వరకు ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

జన్మాష్టమి పూజా విధానం:
✾ జన్మాష్టమి పూజను అనుసరించేవారు తప్పకుండా ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది. 
✾ తల స్నానాన్ని ఆచరించాల్సి ఉంటుంది. 
✾ అంతేకాకుండా మీ ఇంటిని శుభ్రం చేయాల్సి ఉంటుంది.
✾ ఇలా చేసిన తర్వాత మళ్లీ పట్టు వస్త్రాలను ధరించి పూజను ప్రారంభించాల్సి ఉంటుంది.
✾ ఆ తర్వాత మీ ఇంటి గర్భగుడిలో దీపం వెలిగించాల్సి ఉంటుంది. 
✾ ఇలా చేసిన తర్వాత గోపాల కృష్ణుడి విగ్రహానికి అభిషేకం చేయాల్సి ఉంటుంది.
✾ గోపాల కృష్ణుడి పూజను రాత్రి మాత్రమే చేయాల్సి ఉంటుంది.
✾ ఆ తర్వాత స్వామివారికి మిఠాయి, డ్రై ఫ్రూట్స్‌ను నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది.
✾ దీంతో పాటు పులిహోరను కూడా నైవేద్యంగా సమర్పించాలి.

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం

Section: 
English Title: 
Krishna Janmashtami 2023: Janmashtami Auspicious Timings Janmashtami Pooja Timings Pooja Methods Rules To Follow
News Source: 
Home Title: 

Krishna Janmashtami 2023: తిథిల కారణంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి పండగ తేదీల్లో మార్పులు, పండగ ఏ రోజు జరుపుకోవాలంటే..

Krishna Janmashtami 2023: తిథిల కారణంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి పండగ తేదీల్లో మార్పులు, పండగ ఏ రోజు జరుపుకోవాలంటే..
Caption: 
source file: zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
తిథిల కారణంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి పండగ తేదీల్లో మార్పులు..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Thursday, August 31, 2023 - 15:38
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
49
Is Breaking News: 
No
Word Count: 
300