Maha Shivratri 2022: శివ రాత్రి 2022 శుభాకాంక్షలు, గ్రీటింగ్స్, వాట్సాప్ మెసేజ్‌లు

Maha Shivratri 2022: దేశవ్యాప్తంగా మంగళవారం మహా శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. మరి ఈ శివరాత్రికి మీకు ప్రియమైన వారికి శివరాత్రి శుభాకాంక్షలు ఇలా చెప్పండి..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2022, 06:08 PM IST
  • దేశవ్యాప్తంగా రేపే మహా శివరాత్రి
  • ఉత్సవాలకు సిద్ధమైన శివాలయాలు
  • ఉపవాస దీక్షలతో శివుడి అనుగ్రహం కోసం భక్తుల ఏర్పాట్లు..
Maha Shivratri 2022: శివ రాత్రి 2022 శుభాకాంక్షలు, గ్రీటింగ్స్, వాట్సాప్ మెసేజ్‌లు

Maha Shivratri 2022: మహా శివరాత్రి.. దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో కోట్లాది మంది ఈ రోజును జరుపుకుంటారు. ఉపవాస దీక్షలు, ప్రత్యేక పూజలతో ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. శివుడుని పూజించే వారంతా తమకు ఇష్టమైన వారందరికి.. శివుడి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ సందేశాలు పంపుతుంటారు. ప్రస్తుత కాలంలకో డిజిటల్​ వేదికలైన ఫేస్​బుక్, ట్విట్టర్​, వాట్సాప్​లలో స్టేటస్​లలో శివుడి గురించిన ప్రత్యేక సందేశాలను పెట్టుకుంటారు. మరి ఈ సారి శివరాత్రి సందేశాలను పంపించడానికి, వివిధ డిజిటల్ ప్లాట్​ఫామ్స్​పై స్టేటస్​ పెట్టుకునేందుకు కొన్ని ఆకర్షణీయమైన గ్రీటింగ్స్ మీకోసం అందిస్తున్నాం.

1. నేడు  శివరాత్రి. ఇది మహా శివుడుకి అత్యంత ప్రీతికరమైన రోజు. అందుకే అత్యంత పవిత్రమైన ఈ రోజును.. ఆనందంగా జరుపుకోండి. శివుడి విలువలను అర్థం చేసుకుని.. ఇతరులకు సహాయపడండి. అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు.

2. పవిత్రమైన శివరాత్రి రోజు.. ప్రజలందరికీ మేలు జరగాలని, ఆ పరమ శివుడు అందరికి సుఖ సంతోషాలను ఇవ్వాలని ప్రార్థిస్తున్న. ఓం నమ శివాయ!!

3. మీకు, మీ కుటుంబ సభ్యులకు మహా శివుడి అనుగ్రహం కలగాలని.. ఈ పవిత్రమైన శివరాత్రి మీ ఇంట్లో అనందాన్ని, ప్రశాంతతను రెట్టింపు చేయాలని ఆశిస్తు.. మహా శివరాత్రి శుభాకాంక్షలు.

4. మహా శివుడు ఎల్లప్పుడూ మీ వెంట ఉంటాడు. మంచి ఉద్దేశంతో చేయాలనుకున్న పనులను ప్రోత్సహిస్తూ అందుకు కావాల్సిన శక్తిని మీకు అందిస్తాడు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.

5. మహాశివరాత్రి నాడు శివుడి అనుగ్రహం లభించాలని ప్రార్థిస్తన్నా. ఈ ప్రత్యేకమైన రోజు మీకు అన్ని శుభాలే జరగాలని భావిస్తున్నాను. మీకూ, మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు.

Also read: Samudrik Shastra: అక్కడ పుట్టుమచ్చ ఉండే స్త్రీలు చాలా రొమాంటిక్‌గా ఉంటారట...

Also read: Maha Shivratri 2022: మహాశివరాత్రి నాడు శివుడికి రుద్రాభిషేకం చేస్తే... మీ ప్రతి కోరిక నెరవేరుతుంది..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News