Mahalakshmi Yogam: బుధ, శుక్ర గ్రహాల కలయిక, మహాలక్మీ యోగం ఆ మూడు రాశులకే, డబ్బే డబ్బు..

Mahalakshmi Yogam: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జూన్‌లో బుధ, శుక్ర గ్రహాల కలయికతో మహాలక్ష్మీ యోగం ప్రాప్తిస్తుంది. ఈ మహాలక్ష్మియోగం ప్రయోజనాలు మూడు రాశులపై స్పష్టంగా ఉంటుంది. అవేంటో చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 8, 2022, 07:32 PM IST
Mahalakshmi Yogam: బుధ, శుక్ర గ్రహాల కలయిక, మహాలక్మీ యోగం ఆ మూడు రాశులకే, డబ్బే డబ్బు..

Mahalakshmi Yogam: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జూన్‌లో బుధ, శుక్ర గ్రహాల కలయికతో మహాలక్ష్మీ యోగం ప్రాప్తిస్తుంది. ఈ మహాలక్ష్మియోగం ప్రయోజనాలు మూడు రాశులపై స్పష్టంగా ఉంటుంది. అవేంటో చూద్దాం..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏ గ్రహమైనా మరో గ్రహంతో పాటు కదలిక ఉంటే ఆ ప్రభావం అన్ని రాశులపై స్పష్టంగా ఉంటుంది. జూన్ 18న బుధ, శుక్ర గ్రహాల కలవనున్నాయి. జూన్ 18వ తేదీన శుక్ర గ్రహం వృషభ రాశిలో ప్రవేశించనుండగా..బుధ గ్రహం ఇప్పటికే ఆ రాశిలో ఉంది. ఈ పరిస్థితుల్లో రెండు గ్రహాలు కలవనున్నాయి. ఇది మహాలక్ష్మీ యోగానికి దారి తీస్తుంది. 

శుక్రగ్రహం విలాసవంతానికి, సంపద, వైభవం, రోమాన్స్, ఐశ్వర్యానికి కారకంగా ఉంది. అటు బుధ గ్రహం బుద్ధి, తర్కం, సంవాదం, సంచారం, చాతుర్యతకు కారకంగా ఉంది. కుండలిలో ఈ రెండు గ్రహాలు కలిసుండటం వల్లన మహాలక్ష్మీ యోగం ప్రాప్తిస్తుంది. ఇది అన్ని రాశులపై జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. కానీ ఈ మూడు రాశులపై ఈ యోగం శుభ ప్రయోజనంగా ఉంటుందని అంటున్నారు. 

మహాలక్ష్మీయోగంతో మారనున్న ఈ రాశుల జాతకం

మేషరాశి జాతకం కలిగినవారికి ఈ యోగం రెండవ స్థానంలో ఉంది. కుండలిలో రెండవ స్థానం డబ్బుదే. అందుకే అంతులేని ధనం లభిస్తుంది. వ్యాపారంలో ధనలాభం ఉంటుంది. నిలిచిపోయిన డబ్బులు ఇదే సమయంలో తిరిగొస్తుంది. ఈ సందర్భంగా ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది. మేషరాశివారికి ధనలాభం బాగుంటుంది. ఈ సందర్భంగా పన్నా రత్నం ధరిస్తే మంచిది.

కర్కాటక రాశివారికి బుధ శుక్ర గ్రహాల యోగంతో లాభాలు కలుగుతాయి. మహాలక్ష్మీ యోగం ఈ రాశిపై 11వ స్థానంలో ఉంటుంది. దీనిని లాభం, ఆదాయపు మార్గంగా చెబుతారు. అందుకే ఈ సమయంలో ఈ జాతకం కలిగినవారి ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయపు కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఈ సమయంలో ఏదైనా పెద్ద డీల్ కుదిరే అవకాశాలున్నాయి. మహాలక్ష్మీయోగం సందర్భంగా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. కర్కాటక రాశి జాతకులు మూన్ స్టోన్ ధరిస్తే చాలా మంచిది.

సింహరాశివారికి లక్ష్మీ నారాయణ యోగం పదవ స్థానంలో ఉంటుంది. ఈ స్థానం ఉద్యోగం, వర్క్‌ప్లేస్‌కు చెందింది. ఈ పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాల ఆఫర్లు రావచ్చు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్టయితే..ఈ సందర్భంగా పదోన్నతి కలుగుతుంది. ఈ సమయంలో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. 

Also read: Broom Vastu Tips: ఇంట్లో చీపురు ఎక్కడ, ఎలా ఉంచాలి, లేకపోతే ఏం జరుగుతుంది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News