Mahashivratri 2023: మహాశివరాత్రి నుండి ఈ రాశులకు మంచి రోజులు.. ఇందులో మీరున్నారా?

Grah gochar 2023: మహాశివరాత్రికి ముందు కొన్ని గ్రహాల గమనంలో పెను మార్పు వచ్చింది. ఆ గ్రహాల సంచారం కారణంగా ఈరోజు నుంచి మంచి రోజులు వస్తాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2023, 09:30 AM IST
  • ఇవాళే మహాశివరాత్రి
  • ఈ పండుగ కొన్ని రాశులకు మంచిది
  • ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి.
Mahashivratri 2023: మహాశివరాత్రి నుండి ఈ రాశులకు మంచి రోజులు.. ఇందులో మీరున్నారా?

Mahashivratri 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం, మాఘ మాసంలో వచ్చే శివరాత్రినే మహాశివరాత్రి అంటాం. ఇది శీతాకాలం చివరిలో, వేసవి కాలం ప్రారంభానికి ముందు వస్తుంది. ఈ పవిత్రమైన పర్వదినం ఈరోజు అంటే ఫిబ్రవరి 18న వచ్చింది. ఈరోజున మహాదేవుడిని పూజిస్తే మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. గ్రహాల సంచారం పరంగా కూడా ఈరోజు చాలా మంచిది. ఈ పండుగకు ముందే ముఖ్యమైన గ్రహాలైన సూర్యుడు, శుక్రుడు స్థానాల్లో మార్పు వచ్చింది. మహాశివరాత్రికి ముందు ఈ గ్రహాల సంచారం ఐదు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో ఓ లుక్కేద్దాం. 

కన్య: మహాశివరాత్రి కన్యారాశి వారికి సంపద పెరిగేలా చేస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో భారీగా ధనాన్ని ఇస్తుంది. మీరు ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇదే మంచి సమయం. కొత్త పెళ్లైన వారికి ఈ సమయం బాగుంటుంది. వాయిదా వేసిన పనులన్నింటినీ ఇప్పుడు పూర్తిచేస్తారు. 
ధనుస్సు: మహాశివరాత్రితో ధనుస్సు రాశికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అప్పుల నుండి బయటపడతారు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. ఆదాయం రెట్టింపు అవుతుంది. బిజినెస్ భారీగా లాభాలను ఇస్తుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. 
మిథునం: మిథున రాశి వారికి మహాశివరాత్రి నాడు మంచి ఫలితాలను ఇస్తుంది. వీరు ఆర్థికంగా లాభపడతారు. వ్యాపారులకు అదృష్టం కలిసి వచ్చి మునుపెన్నడూ చూడని లాభాలను చూస్తారు. మీలో ధైర్యం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

సింహం: ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. జాబ్ విషయంలో మీ చింతలన్నీ తొలగిపోతాయి. మీరు ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సక్సెస్ అవుతారు. 
కుంభం: మహాశివరాత్రి పర్వదినం కుంభరాశి వారి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఈరోజు మీరు ఏపని తలపెట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. డబ్బును ఆదా చేస్తారు. నిరుద్యోగులకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. 

Also Read: Mahashivratri 2023: మహాశివరాత్రి రోజు ఏ సమయంలో పూజిస్తే ధనవంతులు అవుతారో తెలుసా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

డ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News