Malavya Yog 2023: ఫాల్గుణ మాసంలో మాళవ్య యోగం.. మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు చేస్తే అద్భుత ప్రయోజనాలు..

Malavya Yog 2023: శుక్రుడి సంచారం వల్ల ఏర్పడిన మాళవ్య యోగం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. రాశిచక్రం ప్రకారం నివారణలు తెలుసుకోండి.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2023, 03:20 PM IST
Malavya Yog 2023: ఫాల్గుణ మాసంలో మాళవ్య యోగం.. మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు చేస్తే అద్భుత ప్రయోజనాలు..

Malavya Yog 2023: మరో మూడు రోజుల్లో ఫాల్గుణ మాసం ప్రారంభంకానుంది. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో చివరి నెల. దీని తరువాత చైత్రమాసం మెుదలవుతుంది. ఫాల్గుణ మాసంలో వేసవి కాలం స్టార్ట్ అవుతుంది. జ్యోతిషశాస్త్రంలో మాళవ్య యోగం శుక్ర గ్రహానికి సంబంధం ఉంది. ఎలాంటే, శుక్రుడు ఫిబ్రవరి 15న కుంభరాశి నుండి మీనరాశిలోకి వెళ్తున్నాడు. శుక్రుడు మీనంలో ప్రవేశించిన వెంటనే మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఐదు మహాపురుష యోగాలలో ఇది ఒకటి. ఆస్ట్రాలజీలో ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల మీనం, వృషభం, సింహం, ధనుస్సు, కుంభ రాశుల వారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగనున్నాయి. 

మాలవ్య యోగం 2023: రాశిచక్రం ప్రకారం నివారణలు
మేషరాశి
** రోజూ ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు చక్కెర కలిపిన నీటిని తాగండి. 
** ప్రతిరోజూ అమ్మను కంటికి రెప్పలా చూసుకోండి.  
** అవసరం ఉన్నవారికి ఎరుపు లేదా రూబీ రంగు దుస్తులను దానం చేయండి.
వృషభం
** ప్రతిరోజు ఇంటి ఈశాన్య మూలలో నెయ్యి దీపం వెలిగించండి.
** కనకధార స్తోత్రాన్ని రోజూ పఠించండి.
మిధునరాశి
** పేదలకు పెరుగు, పాలు లేదా పంచదార దానం చేయండి.
** ప్రతిరోజూ శివలింగానికి నీటితో అభిషేకం చేయండి.  
కర్కాటక రాశి
** చంద్రకాంతిలో కూర్చుని చంద్రదేవుని మంత్రాలను 108 సార్లు జపించండి.
** పాలు, పెరుగు దానం చేయండి.
** ప్రతిరోజూ శివుని పూజించండి.
సింహరాశి 
** నీటిలో బెల్లం వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.
** ప్రతిరోజూ లక్ష్మీదేవిని పూజించండి.
కన్య రాశి
** ఆవుకు పచ్చి ఆకు కూరలు తినిపించండి.
** ప్రతిరోజూ లక్ష్మీదేవిని పూజించి మందార పువ్వులు సమర్పించండి.  
తులారాశి
** తెల్లని బట్టలు ధరించండి.
** రోజూ శివుని పూజించండి.
** శివునికి రుద్రాభిషేకం చేయండి.
వృశ్చిక రాశి
** రెండు చెంచాల పచ్చి పాలను నీటిలో వేసి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించండి.
** చంద్ర దేవుడి మంత్రాలను జపించండి.
** శివుని పూజించండి.
ధనుస్సు రాశి
** రోజూ తులసి పూజ చేసి ఇంటి ఈశాన్య మూలలో నెయ్యి దీపం వెలిగించాలి.
** నెయ్యి, తెల్ల చందనం, పాలు దానం చేయండి.
మకరరాశి
** తల్లిని ధ్యానించి ఆమె కోరికలు తీర్చండి.
** లక్ష్మీదేవిని నిజమైన హృదయంతో ఎర్రని పువ్వులు సమర్పించి పూజించండి.
** పచ్చి పాలను నీటిలో కలిపి చంద్రునికి అర్ఘ్యం చేయండి.
కుంభ రాశి
** ప్రతిరోజు శివుని పూజించండి మరియు శివలింగానికి నీటిని సమర్పించండి.
** పేదలకు నల్ల బట్టలు దానం చేయండి.
మీనరాశి
** పేదలకు తెల్ల చందనం, నెయ్యి, పాలు, పెరుగు మొదలైన వాటిని దానం చేయండి.
** ప్రతిరోజూ విష్ణుసహస్రనామం జపించండి.
** రోజూ కుంకుమ తిలకం నుదుటిపై రాయండి.
** వెండి గ్లాసులో నీరు త్రాగాలి.

Also Read: Shani Uday 2023: త్వరలో ఉదయించనున్న శనిదేవుడు.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News