Mangal Gochar 2024: కుజుడి సంచారంతో ఈ రాశులవారికి బహుమతులు, ప్రమోషన్స్‌ పక్కా!

Mangal Gochar 2024 Effect in April: ఏప్రిల్‌ 23 తేదిన జరిగే కుజుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఉద్యోగాలు చేస్తున్నవారికి విపరీతమైన లాభాలు కూడా కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 20, 2024, 10:21 AM IST
Mangal Gochar 2024: కుజుడి సంచారంతో ఈ రాశులవారికి బహుమతులు, ప్రమోషన్స్‌ పక్కా!

Mangal Gochar 2024 Effect in April: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా కొన్ని పెద్ద గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందులో కుజ గ్రహం ఒక్కటి. అయితే ఈ గ్రహం ఏప్రిల్‌ 23 తేదిన మరో సారి రాశి సంచారం చేయబోతోతోంది. ఈ సమయంలో కుంభ రాశిలో ఉన్న కుజుడు ఏప్రిల్‌ 23న మీన రాశిలోకి ప్రవేశం చేయబోతున్నాడు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ గ్రహం రాశి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని రాశులవారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ కుజ గ్రహం ప్రభావం కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

వృషభ రాశి:
కుజుడి సంచారం కారణంగా వృషభ రాశి వారి కెరీర్‌పై ప్రత్యేక ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరు ఈ సమయంలో అన్ని సానుకూల ఆలోచనలతో నిండి ఉంటారు. అంతేకాకుండా వీరికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేసేవారికి ఊహంచని ఇంక్రిమెంట్ కూడా లభిస్తాయి. దీంతో పాటు వీరికి బహుమతులు, ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఈ సమయంలో వీరు కొత్త ఆస్తులను కూడా పొందే ఛాన్స్‌ ఉంది. అలాగే ఈ సమయంలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా మనసు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. 

మిథునరాశి:
ఏప్రిల్ 23న కుజుడు మీన రాశిలోకి చేసే సంచారం కారణంగా మిథున రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి తండ్రి మద్ధతు లభించి అనుకున్న విజయాలు కూడా సాధించే అవకాశాలు ఉన్నయి. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారికి ఈ సమయంలో ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రభుత్వంతో సంబంధం ఉన్న వారు ఈ సమయంలో అనేక లాభాలు పొందుతారు. అంతేకాకుండా కొత్త ఆస్తులతో పాటు కార్లు కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌ ఉంది. 

తులారాశి:
కుజుడు సంచారం తులారాశికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన అనేక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరికి అన్ని సమస్యల నుంచి పరిష్కారం లభించి ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి విపరీతంగా జీతాలు పెరుగుతాయి. అంతేకాకుండా ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారకి కూడా ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు మీపై మీ శత్రువులు ఓడిపోయే ఛాన్స్‌ కూడా ఉంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

మకర రాశి:
ఈ కుజుడి సంచారం మకర రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో సామాజిక రంగంలో మంచి పేరు, ప్రతిష్టలు పొందుతారు. అంతేకాకుండా వీరు ఈ సమయంలో విభిన్న లాభాలు కూడా పొందుతారు. అలాగే ప్రయాణాలు చేయడం వల్ల వీరికి ఈ సమయంలో చాలా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి ఈ సమయం కలిసి వస్తుంది. ఈ సమయంలో అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News