Mangal Vakri 2022: అక్టోబర్‌ 30 నుంచి ఈ రాశులవారికి పంగడే.. ఎప్పుడు ఊహించని లాభాలు పొందుతారు..!

Mangal Vakri 2022 Impact: అక్టోబర్‌ 16న అంగారక గ్రహం మిథునరాశిలోకి సంచారం చేసినందున.. దీని ప్రభావం అక్టోబర్‌ 30 వ తేదిన పలు రాశులపై ప్రభావం పడబోతోంది. 12 రాశుల్లో చాలా రకాల మార్పులు జరగబోతున్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2022, 10:31 AM IST
  • అంగారక గ్రహం మిథునరాశిలోకి..
  • సంచారం 4 రాశులవారు ఊహించని..
  • ఆర్థికపరమైన లాభాలు పొందుతారు.
Mangal Vakri 2022: అక్టోబర్‌ 30 నుంచి ఈ రాశులవారికి పంగడే.. ఎప్పుడు ఊహించని లాభాలు పొందుతారు..!

Mangal Vakri 2022 Impact: ప్రతి నెలలో గ్రహాలు సంచారం చేయడం సాధారణం. అయితే ఈ నెల అక్టోబర్‌ 16న అంగారక గ్రహం వృషభరాశిని వదిలి మిథునరాశిలోకి సంచారం చేసింది. దీంతో  ఈ తిరోగమనం వల్ల అక్టోబర్‌ 30 సాయంత్రం 6:55 నిమిషాలకు పలు మార్పులు జరుగే అవకాశాలున్నాయి. అయితే  ఈ సంచారం వల్ల 12 రాశుల్లో తీవ్ర మార్పులు రాబోతున్నాయి. అయితే ఈ క్రమంలో 12 రాశులవారికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కొన్ని రాశుల వారు మంచి ఫలితాలు కూడా పొందే అవకాశాలున్నాయి. అయితే ఛత్‌ పూజ రోజున ఈ సంచారం జరుగుతుంది కాబట్టి నాలుగు రాశులవారికి మహర్హదశ కలగబోతోందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏ రాశుల వారు మంచి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి పండగే:
వృషభం:

కుజుడు తిరోగమనంలో ఉండడం వల్ల వృషభ రాశి వారికి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి.. ఆదాయం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగ, వ్యాపార రంగాల్ల ప్రమోషన్ కూడా పొందుతారు. సామంజంలో గౌరవం పాటు పేరూ ప్రఖ్యాతలు పొందుతారు. పూర్వీకుల ఆస్తి కూడా పొందే అవకాశాలున కూడా ఉన్నాయి.

సింహ రాశి:
ఈ సంచారం వల్ల సింహ రాశి వారికి కూడా చాలా మేలు జరుగుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రాశి వారు చేసే ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు.  అంతేకాకుండా ఈ క్రమంలో చాలా అదృష్టాన్ని పొందుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇక సింహ రాశి వారు విద్యార్థులగా ఉన్నవారు పరీక్షల్లో సులభంగా విజయాలు సాధిస్తారు.

కన్య:
కుజుడు తిరోగమనం వల్ల  కన్యారాశి వారికి మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. ఈ రాశులవారు వ్యాపారాలలో ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ప్రమోషన్స్‌ కోసం ఎదురు చూస్తున్నవారి లభించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో భూములు కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌ కూడా ఉంది. వీరి పట్ల కుటుంబంలో గౌరవం పెరిగుతుంది.

కుంభం:
తిరోగమన దశ వల్ల కుంభ రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ క్రమంలో కుంభ రాశివారికి శక్తి, ఉత్సాహం పెరిగే ఛాన్స్‌ ఎక్కువగా ఉంది. తిరోగమనం కారణంగా కఠినమైన పనులను కూడా సులభంగా చేసే అవకాశాలున్నాయి. ఆర్థిక పరంగా వీరు బలపడే అవకాశాలున్నాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

 

Also Read : Pelli Fame Prudhvi : ప్రతీరోజూ పడక సుఖం కావాలంట!.. 56 ఏళ్ల వయసులో 'పెళ్లి' పృథ్వీ కామెంట్స్.. వామ్మో మామూలోడు కాదు

Also Read :Bigg Boss Shrihan : విన్నర్ అయ్యే అర్హత లేనిది అందుకే.. బొక్క బోర్లా పడ్డ శ్రీహాన్.. ఇక కష్టమేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News