Mangal Gochar 2022: వృషభరాశిలోకి తిరోగమన కుజుడు.. నవంబర్ 13 నుండి ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు

Mangal Gochar 2022: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, తిరోగమన కుజుడు నవంబరు 13న వృషభ రాశిలో సంచరించబోతున్నాడు. దీంతో మూడు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2022, 12:32 PM IST
Mangal Gochar 2022: వృషభరాశిలోకి తిరోగమన కుజుడు.. నవంబర్ 13 నుండి ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు

Mangal Gochar In Taurus 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం యొక్క రాశిచక్రం మారినప్పుడు లేదా తిరోగమనంలో ఉన్నప్పుడు దాని ప్రభావం మెుత్తం అందరిపై కనిపిస్తుంది. ఈ రాశిమార్పు కొందరికి సానుకూలంగానూ, కొందరికి ప్రతికూలంగానూ ఉంటుంది. గ్రహాల కమాండర్ అయిన కుజుడు ప్రస్తుతం మిథునరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. వచ్చే నెల 13న తిరోగమన స్థితిలో వృషభరాశిలో (Mars retrograde in Taurus 2022) సంచరించబోతున్నాడు. దీని ప్రభావం వల్ల మూడు రాశులవారు భారీగా డబ్బు సంపాదించనున్నారు. ఆ రాశులేంటో ఓ లుక్కేద్దాం. 

సింహం (Leo): అంగారకుడి సంచారం మీకు వృత్తి మరియు వ్యాపారంలో విజయాన్నిస్తుంది. ఎందుకంటే మీ రాశిచక్రంలోని పదవ ఇంట్లో కుజుడు సంచరించబోతున్నాడు. ఇది పని మరియు ఉద్యోగం యెుక్క ప్రదేశంగా భావిస్తారు. దీంతో నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. అంతేకాకుండా కొత్త కొత్త ఆర్డర్లను పొందుతారు.  

కర్కాటకం (Cancer): అంగారక గ్రహం వృషభరాశిలో సంచరించిన వెంటనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఎందుకంటే కుజుడు మీ రాశి నుండి పదకొండవ ఇంట్లోకి సంచరించబోతున్నాడు. దీన్నే ఆదాయం మరియు లాభాల స్థానం అంటారు. దీంతో మీ యెుక్క ఆదాయం పెరుగుతుంది. వివిధ వనరుల ద్వారా డబ్బు సమకూరుతుంది. బిజినెస్ విస్తరిస్తుంది. మీరు స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్ మరియు లాటరీలలో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది.  

కన్య (Virgo): కుజుడు మీ రాశి నుండి తొమ్మిదో ఇంట్లోకి సంచరించబోతున్నాడు. ఇది అదృష్టం మరియు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రదేశంగా పరిగణించబడుతుంది. దీని వల్ల మీకు ప్రతి పనిలో అదృష్టం ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు పచ్చ రత్నాన్ని ధరించడం వల్ల మేలు జరుగుతుంది.  

Also Read: Karthika Masam 2022: నేడు కార్తీక మాసం తొలి సోమవారం... శివనామస్మరణతో మారుమ్రోగుతున్న శైవక్షేత్రాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News