Mars transit 2023: 'నీచభంగ్ రాజయోగం' చేసిన కుజుడు.. ఈ 3 రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..

Mangal Gochar 2023: కర్కాటక రాశిలో కుజుడు సంచారం వల్ల నీచభంగ్ రాజయోగం ఏర్పడింది. దీని వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 18, 2023, 10:12 AM IST
Mars transit 2023: 'నీచభంగ్ రాజయోగం' చేసిన కుజుడు.. ఈ 3 రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..

Benefits of Neechbhang Rajyog 2023: గ్రహాలు నిర్థిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తాయి. మే 10న కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. జూలై 01 వరకు అదే రాశిలో కూర్చుని ఉంటాడు. దీని వల్ల నీచభంగ్ రాజయోగం ఏర్పడుతుంది. సాధారణంగా గ్రహాలు బలహీన లేదా అశుభ స్థితిలో ఉంటే అవి చెడు ఫలితాలనే ఇస్తాయి. కానీ బలహీన స్థితిలో కర్కాటక రాశిలో ఉన్న అంగారకుడు మూడు రాశులవారికి మాత్రం మంచి ఫలితాలను ఇవ్వనున్నాడు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

మేష రాశి - కుజుడు సంచారం వల్ల ఏర్పడిన నీచభంగ రాజయోగం మేషరాశి వారికి ఆర్థికంగా లాభాలను ఇవ్వనుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఈ సమయంలో ఆస్తి మరియు రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యక్తులు లాభపడతారు. 
మిథునం - నీచభంగ రాజయోగం మిథునరాశికి శుభఫలితాలను ఇవ్వనుంది. మీరు కెరీర్ లో కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. మీడియా, మార్కెటింగ్, కళ మరియు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు సమయం కలిసి వస్తుంది. 

Also Read: Surya Gochar 2023: మరో 2 రోజుల్లో ఈ 4 రాశులకు మహార్దశ.. మీ రాశి ఉందా?

కన్య - అంగారకుడు ఏర్పరిచిన నీచభంగ్ రాజయోగం కన్యారాశి వారికి ఊహించని లాభాలను ఇస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వివిధ వనరుల ద్వారా ఆదాయం సమకూరుతుంది.  సమాజంలో గౌరవం పెరుగుతుంది. పాత పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. వ్యాపారం విస్తరిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. 

Also Read: Mangal Gochar 2023: త్వరలో సింహరాశి ప్రవేశం చేయనున్న కుజుడు.. ఈ 4 రాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News