Avoid These Activities On Mauni Amavasya: సాధారణంగా మనలో చాలా మందికి ఏరోజు ఏపనులు చేయాలి.. ఏవి చేయకూడదో అస్సలు పాటించరు. ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదుగు బోదుగు లేకుండా ఉండిపోతారు. ముఖ్యంగా అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్యులు చెబుతుంటారు. కొందరు అమావాస్యరోజు ఏది చేయకూడదంటారు. కానీ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాం. చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా దీపాలు వెలిగించి మరీ పండుగను జరుపుకుంటాం.
Read More:Sleeping After Midnight: ఆరోగ్యకరమైన నిద్ర కోసం ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది
అయితే.. అమావాస్య అత్యంత అరుదైన రోజని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈరోజు మంచి పనులు చేస్తే జీవితంలో ఎన్నో ఉన్నతస్థాయికి ఎదుగుతారు. అదే విధంగా .. మౌనీ అమావాస్య రోజు కొన్ని పనులు మాత్రం అస్సలు చేయకూడదు. ముఖ్యంగా ఈరోజు ఎవరు కూడా కటింగ్,షేవింగ్ లు అస్సలు చేయకూడదు. అదే విధంగా కొత్త బట్టలు, చెప్పలు కొనుక్కొకూడదు. మద్యం, మాంసం మాత్రం అస్సలు ముట్టుకోవద్దు. ఇంట్లో దేవతలను, పితృదేవతల అనుగ్రహం కోసం బ్రాహ్మణులను పిలిచి, శ్రాద్ధకర్మలు చేయించుకొవాలి.
ఇలా చేస్తే పితృ దేవతలు ఎంతో ఆనంద పడతారు. ఈరోజు మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండాలి. పితృ సంబంధ కార్యాలు చేసి రాత్రి పూట ఉపవాసం ఉండాలి. అదే విధంగా.. రాగి చెట్టు కింద నల్ల చీమలకు చక్కెర తినడానికి వేయాలి. ఆవులకు పశుగ్రాసం కొనివ్వాలి. పేదవారికి అన్నదానం చేయాలి. పితృదేవతల కోసం ప్రత్యేకంగా ప్రమిదలో దీపారాధన చేయాలి. అదే విధంగా అమావాస్య రోజు రోడ్డుపైన ఏదైన దొరికితే అస్సలు ముట్టుకొవద్దు.
Read More: Malavika Mohanan: అందాల బ్లాస్ట్ చేసిన మలయాళీ కుట్టి.. తట్టుకోలేకపోతున్న కుర్రకారు..
కొందరు తమమీద నుంచి దిష్టి తీసి కాయిన్ లను రోడ్డుమీద పడేస్తుంటారు. ఆరోజున మూడు కూడళ్ల మార్గం వద్ద దిష్టి అన్నం పెడతారని చెబుతుంటారు. గోర్లను కూడా అస్సలు తీయరాదు. ఆరోజున పితృ సంబంధ పూజలు చేసి, తమ ఇంటికి వచ్చేయాలి. ఆరోజున ఏపనులను కూడా ప్రారంభించకూడదు. మన పెద్ద వాళ్లు కూడా అమావాస్య రోజు ఏదైన పనులు చేస్తే మోండిగా ఉంటాయి. అస్సలు పూర్తికాదని చెబుతుండటం మనం తరచుగా వింటూనే ఉంటాం. అందుకే మౌనీ అమావాస్య రోజు ఈ నియమాలు పాటిస్తూ, పొరపాట్లు మాత్రం అస్సలు చేయకుండా చూసుకొవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook