Budh Vakri 2022: జ్యోతిషశాస్త్రంలో బుధ గ్రహాన్ని గ్రహాల యువరాజు అంటారు. పంచాంగం ప్రకారం, సెప్టెంబర్ 10 నుండి కన్యారాశిలో బుధ గ్రహం వ్యతిరేక దిశలో సంచరిస్తోంది. బుధుడు సెప్టెంబర్ 10 ఉదయం 09:07 గంటలకు కన్యారాశిలో తిరోగమనం (Budh Vakri in Virgo 2022) చెందాడు. అదే స్థితిలో 23 రోజుల పాటు అంటే అక్టోబర్ 2 నుండి మధ్యాహ్నం 02:36 వరకు ఉంటారు. బుధ గ్రహం మేధస్సు, తర్కం, తెలివి, సంభాషణ మరియు కమ్యూనికేషన్ కారుకుడిగా భావిస్తారు. కన్యారాశిలో బుధుడు తిరోగమనం ఈ రాశులవారికి కెరీర్ లో పురోగతి, అపారమైన ధనాన్ని ఇవ్వనుంది.
మిథునం (Gemini): కన్యారాశిలో బుధుడు తిరోగమనం చెందడం వల్ల మిథున రాశి వారికి అనేక శుభ ఫలితాలను పొందుతారు. మీ పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది.
కన్య (Virgo): ఈ రాశిలోనే బుధ గ్రహం తిరోగమనంలో ఉంది. దీంతో ఈ రాశివారు వ్యాపారంలో భారీ లాభాలను గడించనున్నారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు భారీగా లాభపడనున్నారు.
వృశ్చికం (Scorpio): బుధుని శుభ ప్రభావం వల్ల ఉద్యోగంలో పురోభివృద్ధికి అవకాశం ఉంది. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు. ఈ సమయంలో మీపై ఎలాంటి ఒత్తిడి ఉండదు.
ధనుస్సు (Sagittarius): తిరోగమన బుధుడు కారణంగా ఈ రాశివారి బిజినెస్ విస్తరిస్తుంది. ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. ఈ రాశివారు ఆర్థికంగా మెరుగుపడుతారు.
Also Read; Guru Vakri 2022: మీనంలో తిరోగమనం చేయనున్న గురుడు.. ఈ 3 రాశుల వారికి ఊహించని ధనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook