Monsoon Hair Care Tips: వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ల తీవ్రత పెరుగుతుంది. ఎందుకంటే వర్షాల కారణంగా వాతావరణం చల్లబడి తేమ పెరుగుతుంది. తేమ పెరగడం కారణంగా ఇన్ఫెక్షన్ల ప్రభావం రెట్టింపు అవుతుంది. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వర్షాకాలంలో తప్పకుండా జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చాలామందిలో వాతావరణంలో తేమ పెరగడం కారణంగా చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్ష న్స్ బారిన పడుతుంటారు. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి జుట్టును సంరక్షించుకోవడానికి ఈ క్రింది చిట్కాలను ప్రతిరోజు పాటించాల్సి ఉంటుంది.
వర్షాకాలంలో మీ జుట్టుని ఇలా సంరక్షించుకోండి..
జుట్టును శుభ్రంగా ఉంచుకోండి:
చాలామందిలో జుట్టు దుమ్ము ధూళితో నిండి ఉంటుంది. వర్షాకాలంలో ఇలా నిండి ఉండడంవల్ల చాలా రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎలాంటి జుట్టు సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతిరోజు జుట్టును తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల జుట్టు మృదువుగా ఉంటుంది.
Also Read: Guntur Karam Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?
జుట్టుకు నూనెను అప్లై చేయాలి:
వర్షాకాలంలో జుట్టు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా జుట్టుకు ఆయిల్ అప్లై చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్లు చిట్లిపోకుండా ఉంటుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా వానాకాలంలో జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జుట్టుకు నూనెను అప్లై చేయాలి.
హెయిర్ కండిషనర్ వినియోగం:
జుట్టు మెరవడానికి అంతేకాకుండా అందంగా కనిపించేందుకు హెయిర్ కండిషనర్ను వినియోగిస్తూ ఉంటారు. అయితే వానాకాలంలో మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన కండిషనర్స్ కాకుండా సహజంగా లభించే వాటిని వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
రసాయనాలతో కూడిన హెయిర్ స్టైలిష్ ప్రోడక్ట్ ను యోగించకూడదు:
ప్రస్తుతం చాలామంది మార్కెట్లో లభించే హెయిర్ కండిషనర్ రసాయనాలతో కూడిన క్రీమ్ లు అతిగా వినియోగిస్తున్నారు. వీటిని వర్షాకాలంలో ఎక్కువగా వినియోగించడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు వీటికి బదులుగా సహజంగా లభించే వాటిని వినియోగించడం చాలా మంచిదని వారు సూచిస్తున్నారు.
Also Read: Guntur Karam Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి